ఈ ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పిల్లలు గాడ్జెట్స్ కి బానిసలవుతున్నారు. వాటి వలన కలిగే అనర్ధాలు, ఏ విధంగా వారు దానికి బానిసలవుతున్నారు మరియు పిల్లలను ఆ బానిసత్వం నుండి దారి మళ్లించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చుడండి.. 
మీ పిల్లవాడు ఇంట్లో ఉన్నప్పుడు.. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ తండ్రి లాప్ టాప్ తో  లేదా ఆఫీస్ కాల్ లో బిజీగా ఉంటారు. తల్లులు ఇంటి పనులతో అంతకంటే బిజీగా ఉంటారు .అటువంటి వాతావరణంలో పిల్లలు టీవీ లేదా మొబైల్ ఫోన్ ల పై ఆధారపడవలసి వస్తుంది .మీ పిల్లలు శారీరకంగా మీకు దగ్గరగా ఉన్నారు .కానీ మానసికంగా మాత్రం కాదు.మీ ఉద్యోగ జీవితంలోనూ మరియు వ్యక్తిగత జీవితాల్లోనూ చిన్న మార్పులు చేసుకోగలిగితే పిల్లలు టీవీ మరియు ఫోన్ లలో గడిపే సమయాన్ని సులభంగా తగ్గించవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే గాడ్జెట్స్ ను ఉపయోగించే విధంగా తల్లి తండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

 

 

 

ఈ గ్యాడ్జెట్స్ ని పిల్లలు ఏ సమయంలో , ఏ అవసరానికి వాడాలో మీరే వారికి ఒక నియమాన్ని స్థిర పరచాలి. ఉదాహరణకు ఏదైనా స్కూల్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకునేలాగా సూచించండి . కేవలం చదువు కి అవసరం అయినప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే విధంగా పిల్లలను సిద్ధ పరచండి.ముందు తల్లితండ్రులు వీలయినంత  సెల్ ఫోన్లు, ల్యాబ్ టాప్ లు, ఐ పాడ్ లు మొదలైన పరికరాలను మీ పిల్లలు ముందు ఉపయోగించడం తగ్గించండి.వీటన్నింటినీ ప్రక్కనపెట్టి మీ ఖాళీ సమయంలో పిల్లలతో కలిసి ఆటలు ఆడడం , చదువుకోవడం, మరేదైనా కళాత్మకమైన పనులు లేదా సామాజిక పరమైన చర్యలు లేదా సృజనాత్మకమైన కార్యక్రమాలలో పాల్గొనండి.

 

 


ప్రకృతి గురించి వారికి తెలియజేయండి. మీరు చిన్నతనంలో ప్రకృతిని ఎంత బాగా ఆస్వాదించే వారో మరియు బయటకు వెళ్లి ఆడుకునే సమయం ఎంత బాగుంటుందో ,మీ చిన్ననాటి జ్ఞాపకాలను వారితో పంచుకొండి. మీ పిల్లలను బయటకు వెళ్లేందుకు అలవాటు చేయండి. వారి ఆసక్తిని బట్టి క్రీడలు వైపు వారిని మళ్ళించండి . వారికి కేవలం చదువు మాత్రమే కాకుండా ఇటువంటి వాటిని అలవాటు చేసినందువల్ల వారు ఎల్లప్పుడూ మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: