చిన్నపిల్లలలో  దంతాల సంరక్షణ అనేది చాలా ముఖ్యం. తల్లితండ్రులు  పసితనంలోను, ఇంకా కొంచం పెద్దయ్యాకా అంటే బాల్యదశలోనూ పిల్లల ఆరోగ్యం వారి పరిరక్షణ విషయాలని చూసేటప్పుడు పళ్ళను గురించిన కొన్ని ముఖ్యమైన లక్షణాలను మర్చిపోతారు. 7 – 9 నెలల మధ్య కాలంలో పిల్లల్లో  కన్పించే ప్రాధమికమైన పళ్ళను పాల పళ్ళు అని అంటారు. మొదటగా ముందు లేదా ఎదర పళ్ళు వస్తాయి. తర్వాత  కింది దవడలో పళ్ళు అటు తరువాత పై దవడలో పళ్ళు నోటి కుహరంలో చిగుళ్ళనుంచి బయటకి రావడం జరుగుతుంది. ఈ ప్రక్రియ పిల్లలకి సుమారుగా 3 సంవత్సరాల వయస్సు వచ్చే సమయానికి 20 పళ్ళతో మంచి అమరిక ఏర్పడుతుంది. మొదటగా పళ్ళు వచ్చే సమయంలో చిగురు భాగం సున్నితంగా ఉండి  లోపల నుంచి పన్ను వస్తున్నప్పుడు ఉండే వత్తిడి కారణంగా చిరాకుగా ఉంది. దీనివల్ల పిల్లలు ఆహారం సరిగ్గా తెసుకోలేరు. 

 

 

 

చిగుళ్ళ నుంచి పళ్ళు బయటకి వచ్చే సమయంలో కలిగే వత్తిడిని తట్టుకోవడానికి పిల్లలు ఏమైనా నోటిలో నమలాలి అని కోరుకుంటే వారికి రస్క్స్, చల్లని ఆపిల్ పండ్ల ముక్కలు, కార్రెట్స్ లేదా మెత్తని రబ్బర్ బొమ్మలు ఇవ్వవచ్చు. అదే కాకుండా వారి చిగుళ్ళపై ఐస్ రుద్దడం వలన కూడా వారికి ఉపసమనం కలుగుతుంది. వారి చిగుళ్ళను సరిగ్గా శుభ్రం చేయడం వల్ల వారికి దంతక్షయం అయ్యే ప్రమాదం బారిన పడకుండా కాపాడవచ్చు. ప్రతిసారి వారు ఆహారం తీసుకున్న తరువాత పళ్ళను, నోటిని శ్రుభ్రంగా ఉంచటానికి మెత్తటి బట్టని ఉపయోగించవచ్చు.అలాగే పిల్లల్ని వీలయినంత వరకు తీపిపదార్ధాలు, చాక్లెట్స్ కి దూరంగా ఉంచాలి. లేదంటే పళ్ళు పుచ్చిపోతాయి. 

 

 

 

రోజులో ఒకసారి వేలుని బ్రష్ లాగా ఉపయోగించే అలవాటు చేసినట్లయితే వారు ఎదిగే సమయంలో పళ్ళు పరిశుభ్రపరుచుకోవడం అలవాటు చేసుకోవాలి.  చిన్నపిల్లల పాల పళ్ళు ఎంతో ముఖ్యమైనవని, ఆ సమయంలో ఏమైనా అసాధారణమైన సమస్యలు వస్తే అవి పాల పళ్ళు పోయి శాశ్వత పళ్ళు వచ్చాక కూడా పిల్లల్ని భాధిస్తాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: