ఒక యజమాని వేటకు వెళ్తూ తన వద్ద రెండు కుక్కల్లో ఒక దానిని ఇంటికి కాపలాగా ఉంచి రెండవ దానితో వేటకు వెళ్లాడు. వేట కుక్క వేటాడి తెస్తే కొంత భాగం యజమాని కాపలా కుక్కకు కూడా పెట్టేవాడు. అప్పుడు వేట కుక్క కష్టం నాది సుఖం నీది అని నిష్టూరమాడింది. అప్పుడూ కాపలా కుక్క తప్పు నాది కాదు. నాకు పని నేర్పకుండా ఇంట్లో ఉంచిన యజమానిది అన్నది నీతి : బద్దకస్తులైన పిల్లల్ని అలా పెంచిన తల్లిదండ్రులదే బాద్యత.  

మరింత సమాచారం తెలుసుకోండి: