ప్రేమ చేసిన గాయంతో మనసు  కొన్నిసార్లు తీవ్రమైన బాధకు గురి అవ్వుతుంది . దీంతో మనం ఆ బాధనుంచి బయటపడలేం అన్నట్టు ఉంటుంది. ప్రేమ వల్ల అయిన గాయానికి కాలమే మందు అంటుంటారు కదా,అలానే కాలమే దానికి  అన్ని నేర్పిస్తుంది.అనుభవం నేర్పిన పాఠాలే  భవిష్యత్తులో  గుణపాఠాలై తప్పటడుగులు వేయనీయకుండా  సూచిస్తాయి.కొన్ని సందర్భాల్లో మనం చెడు అనుకున్నది  మంచి అవుతుంది.

ముక్యంగా  ప్రేమకు సంబంధించిన విషయాల్లో, ప్రేమికుల మధ్య అభిప్రాయ బేధాలు రావటం, విడిపోవటం వంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి.అలాంటి సమయాల్లో కొంతమంది జీవితమే పోయినట్లుగా బాధపడుతూ,ఏడుస్తూ  ఉంటారు. ప్రేమలో విఫలామ్ అవ్వడం అంటే  అది విషాదమైనది కాదు. బ్రేకప్‌ మనకు ప్రేమ, మానవ సంబంధాల విలువలు అలాంటివి,ఎన్నో నేర్పుతుంది! విలువైన గుణపాఠాలను చెబుతుంది.ఎదుటి వ్యక్తి తప్పొప్పులు మనకు కనపడవు.మనం లోతుగా  ప్రేమలో ఉన్నపుడు ఎదుటి వ్యక్తిలోని మంచి మాత్రమే కన్పిస్తుంది. అవతల వారి తప్పులు కూడా ప్రేమ కారణంగా మనకు ఒప్పులుగానే కన్పిస్తాయి. ఆ వ్యక్తితో బ్రేకప్‌ అయినపుడు మాత్రమే అతడిలోని చెడు  మనకు కన్పిస్తుంది. అందుకే మన ప్రేమ ఎదుటి వ్యక్తి  తాలూకు చెడు  బిహేవియర్ కప్పిపెట్టేలా ఉండకూడదు. అలా అని అదే పనిగా వారి చెడు లక్షణాలకు ఎత్తి చూపకూడదు. 

బంధాలు దీర్ఘకాలం కొనసాగాలంటే వ్యక్తులు ఒకరికొకరు అనుకూలంగా ఉండాలని అనుకుంటాం,కానీ వ్యక్తుల మధ్య అనుకూలతలు అన్ని వేళలా మంచిది కాదని తెలుసుకోవాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండి ఒకే రకమైన అలవాట్లు కూడా ఉన్నంత మాత్రాన బంధాలు కలకాలం నిలుస్తాయి అన్నది లేదు. వ్యక్తిత్వ తేడాలు బంధాన్ని నాశనం చేయోచ్చు. రెండు వేరువేరు వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు కలిసుండటమన్నది కష్టతరమైన పని. ఒకరు ఇంట్రావర్ట్‌, మరొకరు ఎక్స్‌ట్రావర్ట్‌ అయితే ఆ బంధాన్ని నిలుపుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక్కోసారి.

మరింత సమాచారం తెలుసుకోండి: