ముందుగా మెటబాలిజం అంటే ఏమిటో తెలుసుకుందామా....శరీరం శక్తిని ఖర్చు చేసే వేగమే మెటబాలిజం. ఈ వేగం మన ఆహారపుటలపవాట్లు, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. బాడీ మెటబాలిజాన్ని పరిగెత్తించగలిగితే, శరీరంలో కొవ్వు పేరుకునే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి అందుకు ఉపయోగపడే అలవాట్లను అలవరుచుకోవాలి.


ఆ అలవాట్లు ఏమిటో కూడా  తెలుసుకుందామామరి. ముఖ్యంగా డైటింగ్‌ అవసరమా....డైటింగ్‌తో కడుపు మాడ్చుకుంటూ, హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌ చేస్తే, అందుకు సరిపడా శక్తి అందక బలహీనపడతాం. ఇందుకు కారణం డైటింగ్‌ సమయంలో, శక్తిని పొదుపు చేసుకోవడం కోసం శరీర జీవక్రియలను మందగింపజేయాలనే మెసేజ్‌ మెటబాలిజానికి చేరడమే. కంటి నిండా కునుకు కచ్చితంగా ఉండాలి. బాడీ మెటబాలిజం చురుగ్గా ఉండాలంటే కంటి నిండా నిద్ర తప్పనిసరి. కాబట్టి రోజుకు 8 గంటలకు తగ్గకుండా ప్రశాంతంగా నిద్ర పోవాలి.


హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌.. వ్యాయామం తర్వాత కూడా మెటబాలిజం వేగంతో పని చేయాలంటే హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌కూడా చేయాలి. దీన్నే ‘ఆఫ్టర్‌ బర్న్‌ వర్కవుట్‌’ అని కూడా అంటారు. బరువులు మోయండి. బరువులు ఎత్తడం వల్ల లీన్‌ మజిల్‌ మాస్‌ తయారవుతుంది. కాబట్టి నిద్రావస్థలో ఉన్న మెటబాలిజం మేల్కొనేలా బరువులతో కూడిన వ్యాయామాలు కచ్చితంగా చేయాలి.


మంచి ఆహారం తీసుకొవాలి. జీర్ణశక్తి మందగించే ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్. జంక్ ఫుడ్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి ఆహారం వల్ల శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ పెరిగి మెటబాలిజం కుంటు పడుతుంది. కాబట్టి తేలికగా అరుగుతూ, స్వల్ప పరిమాణాల్లో గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేసే ఆహారానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి వీలైనంత వరకు ఇంటి ఫుడ్డుకు ప్రాధాన్యతనిస్తూ ఉంటే బాడీ మెటబాలిజాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: