మ‌న‌కు  దానిమ్మ పండు ఏ సీజ‌న్‌లో అయినా సులువుగా దొరుకుతుంది. చ‌క్కని రంగులో తిన‌డానికి రుచిక‌రంగా ఉండే ఈ పండు ద్వారా మ‌న‌కు అనేక పోష‌కాలను మనము పొందవచ్చు. పొటాషియం, ఫైబ‌ర్‌, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్‌, విట‌మిన్ బి6, మెగ్నిషియం ఇలా అన్ని రకాల ఎన్నో పోష‌కాలు దానిమ్మ పండ్ల‌లో మనకు లభిస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజుకో దానిమ్మ పండును ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు మనము మన సొంతం చేసుకోవచ్చు.

 

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి...

 

 1. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి వంటి పోష‌కాలు దానిమ్మ పండ్ల‌లో పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్లు మన దారికి అసలు రావు అంటే నమ్మండి. ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌, బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ లు రాకుండా చేస్తాయి. 

 

2. దానిమ్మ తినడం వల్ల ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ బాగా మెరుగు పరుస్తుంది. దీని ద్వారా  గుండె జ‌బ్బులు రాకుండా కూడా చేస్తుంది.

 

 3. సంతానం లేని వారికి దానిమ్మ పండును ఒక వ‌రం అనే అనుకోవచ్చు. ఎందుకంటే దంప‌తులు ఇద్ద‌రూ రోజూ దానిమ్మ పండును తింటే వారి శృంగార స‌మ‌స్య‌లు పోవ‌డ‌మే కాదు, ఆ శ‌క్తి కూడా  బాగా పెరుగుతుంది. స్త్రీల‌లో రుతుక్ర‌మం స‌రిగ్గా అవ్వడం జరుగుతుంది. త‌ద్వారా సంతానం క‌లిగేందుకు చాల అవ‌కాశం కూడా ఉంది.

 

4. దానిమ్మ తినడం వల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా కూడా చేస్తుంది. ముఖ్యంగా మనకు రోగాల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది.

 

 5. దానిమ్మ తినడం వల్ల  ఎముక‌లు దృఢంగా మారుతాయి. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు సులువుగా పోతాయి. బీపీ లెవెల్ కూడా బాగా త‌గ్గుతుంది. ర‌క్తం పెరుగుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా బాగా ఉంటుంది.

 

 6. దంత తీసుకోవడం  వల్ల  స‌మ‌స్య‌లు మనకి  ఎప్పటికి  రావు . చిగుళ్ల వాపు, నొప్పి త‌గ్గుతాయి. నోటి దుర్వాస‌న కూడా రాకుండా చూస్తుంది. 

 

7. దానిమ్మ తీసుకోవడం వల్ల  డ‌యేరియా స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది మనకి. చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా కూడా పెరగడం జరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: