క్యాన్సర్.. ఎన్నో రకాలుగా ఉండే ఈ వ్యాధి వ్యక్తుల ప్రాణాలను హరిస్తుంది. ఇందులో ఎన్నో రకరకాల క్యాన్సర్‌ లు వస్తున్నాయి. ఇవి ప్రాణాలను కూడా తీస్తున్నాయి. ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాలు వచ్చినా ఈ వ్యాధి తీవ్రత అసలు తగ్గట్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యని కాస్త త్వరగా తగ్గించుకోవచ్చు.

 

 

ఇందులో కివీ పండ్లలో క్యాన్సర్‌ కి వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనితో వీటిని తినడం వల్ల చర్మ, కాలేయ, ప్రొస్టేట్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ఈ పండుని తినడం వల్ల జీర్ణక్రియ కూడా వేగవంతం పెరుగుతుంది. రక్త సరఫరా కూడా మెరుగవుతుంది. పిల్లలకు ఈ పండు ఇవ్వడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. గర్భిణీ స్త్రీలు ఈ పండుని తినడం వల్ల మహిళలకు పుట్టబోయే బిడ్డలకు కూడా చాలా మంచిది.

 

 

శ్వాస, ఆస్తమా వంటి సమస్యలని కూడా ఈ పండు దూరం చేయగలుగుతుంది. ఈ పండులో ఎక్కువగా ఆర్జినిన్, గ్లుటామిన్ అనే అమినోయాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి తినడం వల్ల గుండెకి రక్త సరఫరా బాగా జరుగుతుంది. కివీ పండులో జింక్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా బాగా పెరుగుతుంది. కివీ తొక్కలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ యాక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ ని తొలగించి అది కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

 

 

ఇక ​బ్యూటీ బెనిఫిట్స్ విషయానికి వస్తే కివీ పండ్లు.. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనకి దొరుకుతుంటాయి. మిగతా పండ్లతో పోలిస్తే వీటిని తక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతారు. కానీ, వీటి వల్ల కలిగే బ్యూటీ బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం అస్సలు ఈ ఫ్రూట్స్‌ని వదలరు. ఈ పండ్లని రెగ్యులర్‌ గా తినడం వల్ల చర్మం తాజాగా, అందంగా నిగనిగలాడుతోంది. కాలుష్యం వంటి కారణాలతో చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు రావడం వంటి సమస్యలు వంటివి దూరంగా ఉండవచ్చు. కివీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి లు సమృద్ధిగా లభిస్తాయి. నారింజ, బత్తాయి, నిమ్మకంటే ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి కావాల్సిన పోషకాలన్నింటినీ ఇది ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: