ట్రావెలింగ్ అంటే ఇష్టం, అలాగే ఎవరికైనా జీవితంలో ఒక్కసారైనా వెళ్లి చూడాలని అనిపించే ప్రదేశం గోవా. గోవాలో ముఖ్యంగా చూడతగ్గ వాటిలో ముందు చెప్పుకొనేది బీచ్ లు. అక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం చూడదగినవి. నారింజ రంగు బంతిలా కనిపించే సూర్యుని రంగును అద్దుకుని మెరిసే ఆకాశాన్ని, ఆ దృశ్యాలను మరింత అందంగా చూపించే సాగర తీరాన్ని చూస్తూ సమయం ఆలా గడపడం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించండి. గోవాను తప్పనిసరిగా ఎందుకు సందర్శించాలనే ప్రశ్నకు దీనిని కూడా ఓ సమాధానంగా ఈజీగా చెప్పవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నా, లేక మీ ప్రియమైన వారితో ఉన్నా ఇక్కడి సూర్యాస్తమయ సమయం ఎప్పుడూ మీకు ఒక జ్ఞాపకంగా ఉంటుంది. గోవాలో అటువంటి అందమైన అనుభూతులను మీకందించే కొన్ని అద్భుతమైన బీచ్ ల గురించి పూర్తి వివరాలు మీకోసం...

 


అంజున బీచ్: ఈ బీచ్ ఉత్తర గోవాలో ఉన్న ప్రముఖ బీచ్ ప్రదేశాలలో అంజున బీచ్ ఒకటి. దీనిని 'బీచ్ ఆఫ్ ది హిప్పెస్' అని కూడా అంటారు. ఈ బీచ్ కు సూర్యాస్తమయానికి కాస్త ముందుగానే చేరుకుని మీకు అనుకూలంగా ఉండే ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకోండి. మీకు నచ్చిన డ్రింక్ ను వెంట తెచ్చుకుని, ఇష్టమైన పాటలను వింటూ సూర్యాస్తమయ సమయాన్ని ఎంజాయ్ చేసే విధంగా ప్లాన్ ని చూసుకోండి.

 

పలోలెం బీచ్: ఈ బీచ్ గోవాలోని  కెనకోనాలో ఉన్న పలోలెం బీచ్ నెలవంక ఆకారంలో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. చుట్టూ తాటి చెట్లతో ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు దీని సొంతం. దక్షిణ గోవాలోని అందమైన బీచ్ ప్రదేశాలలో ఇది ఒకటని చెప్పవచ్చు. ఫోటోగ్రాఫర్ లతో పాటు ప్రకృతి ప్రేమికులకు ఇది అనువైన ప్రదేశం. తీరం వెంబడి వీచే చల్లని గాలులు, పక్షుల కిలకిలలు, అలల ధ్వనుల మధ్య అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలను వీక్షించడం ఇక్కడికి వచ్చిన టూరిస్టులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది.

 

చపోరా కోట: బాలీవుడ్ చిత్రం దిల్ చహతా హై సినిమా షూటింగ్ జరిగిన తర్వాత నుంచి వగటర్ బీచ్ వద్ద ఉన్న చపోరా కోట ప్రసిద్ధి చెందింది. గోవాలో ఉన్న ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటైన ఈ కోట ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి నుంచి కనిపించే సూర్యోదయ దృశ్యాలు సందర్శకులను అలా కట్టిపడేస్తాయి. ఈ కోట గోడపై కూర్చుకుని సముద్రం చివర కనిపించే సూర్యాస్తమయాన్ని ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. విస్తృతమైన బీచ్, తాటి చెట్ల మధ్య ఎర్రని వర్ణంలో ప్రకాశించే ప్రకృతి అందాలు ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ ఉంటాయి.

 

అరంబోల్ బీచ్: ఈ బీచ్ ను గోవా యొక్క తెల్లని ఇసుక తీరం (వైట్ శాండ్ బీచ్) అని పిలుస్తారు. సూర్యాస్తమయాన్ని మరింత అందంగా చూపించే ప్రకృతి దృశ్యాలను ఈ ప్రాంతం సొంతం. ఉత్తర గోవాకు ఆఖరిలో ఉండడంతో ఈ బీచ్ గురించి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇక్కడ పర్యాటక తాకిడి కాస్త తక్కువే. కాబట్టి సూర్యాస్తమయ దృశ్యాలను వీక్షించేందుకు కావాల్సినంత ఏకాంతం మీకు ఇక్కడ దొరుకుతుంది.

 

వగటర్ బీచ్: ఈ బీచ్ చపోరా కోటకు తర్వాత కుడి వైపున వగటర్ బీచ్ ఉంటుంది. ఉత్తర గోవాలో ప్రసిద్ధి చెందిన అందమైన బీచ్ లలో ఇది కూడా ఒకటి. సూర్యాస్తమయ దృశ్యాలను వీక్షించేందుకు ఇక్కడ ప్రత్యేకమైన ప్రదేశాలు అనిపిస్తాయి. బీచ్ సమీపంలో ఉండే బార్ రెస్టారెంట్ వద్ద ఒక టేబుల్ ను ఎంచుకుని మరపురాని సూర్యాస్తమయ దృశ్యాలను ఆనందించవచ్చు. ఒక వైపు చల్లని గాలుల మధ్య సూర్యాస్తమయ అందాలు, మరో వైపు నోరూరించే రుచులను ఆస్వాదిస్తూ ఇక్కడ సమయం ఆనందంగా గడపవచ్చు.

 

మోర్జిమ్ బీచ్: గోవాలో అందమైన సూర్యాస్తమయ దృశ్యాలను అందించే ప్రదేశాలలో మోర్జిన్ బీచ్ ప్రముఖమైనది. అంజున బీచ్ కు తర్వాత కుడి వైపున ఈ ప్రదేశం ఉంటుంది. ఇక్కడి సూర్యాస్తమయ దృశ్యాలు మీ గుండెను ఆహ్లాదపరుస్తాయి. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఇక్కడ కనపడ్డం ఈ బీచ్ ప్రసిద్ధి. సాయంత్రం వేళల్లో ఇక్కడ ఉండే అందాలను పదిలంగా దాచుకునేందుకు మీ వెంట కెమెరాను తప్పక తీసుకెళ్లండి.

 

సింక్వెరిమ్ బీచ్: గోవాలోని ఇతర బీచ్ లతో పోల్చుకుంటే సింక్వెరిమ్ బీచ్ కు పర్యాటక తాకిడి చాలా తక్కువగా ఉంటుంది. కండోలిమ్ కు ఇది దగ్గరగా ఉంటుంది. ఎప్పటికీ చెప్పుకోదగ్గ అందమైన సూర్యాస్తమయ దృశ్యాలను మీకు అందిస్తుంది. ఇక్కడ కోటకు పక్కనే ఉన్న మార్గం గుండా నడుచుకుంటూ అనేక ప్రకృతి అందాలను మీరు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: