ఈ ఆధునిక కాలంలో ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అలాగే భారతదేశంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాల విషయంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నాయి. గతంలో భారత దేశంలో ఆడవాళ్లు మద్యం సేవించాలని అంటే అదో పాపం బాగా చూసే వాళ్ళు. కానీ పాశ్చాత్య దేశం అలవాట్లు ఇప్పుడు మన భారత దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అమెరికా ,యూరోప్ లాంటి దేశాలలో మద్యం సేవించడం అనేది సర్వసాధారణమైన విషయం అక్కడ వాతావరణం వారికి అలాంటి అలవాటు వచ్చేస్తాయి.

 

 కానీ ఆధునిక పోకడలతో భారతదేశంలో కూడా మహిళలు మద్యం సేవించడం ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది. అలాగే ఆర్థికంగా స్థిరపడటంతో ఈ అవకాశాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. తాజాగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిగా మంత్రిత్వ శాఖ వెల్లడించిన రిపోర్టులో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. దేశంలో పదేళ్ళ వయసులోనే మద్యం తాగుతున్న వాళ్ళు రోజురోజుకు ఎక్కువవుతున్నారని నివేదిక స్పష్టం చేసింది.

 

మన దేశంలో ఇప్పటి వరకు మొత్తం 14.6 శాతం వారు మద్యానికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి 17 మంది మగ వాళ్లకు ఒక మహిళ మద్యం సేవించి సేవిస్తున్నారు. మొత్తం 16 కోట్ల మందిలో దాదాపు 95 లక్షల మంది ఆడవాళ్లు మద్యం సేవిస్తున్నారు అని తెలుస్తుంది. మద్యం సేవిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒక మగాడు దానికి బానిసగా మారిపోతున్నారట. మద్యం తాగే వాళ్ళు మూడు వంతులు స్వదేశీ బ్రాండ్ కు ఇష్టపడుతున్నారు.

 

మద్యం సేవించే వారిలో బీరు ప్రియులు చాలా ఎక్కువగా ఉంటారు. 16 కోట్ల మందిలో 21 శాతం మంది బీరు మాత్రమే తాగుతారు. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ బీరులు తాగే శాతం 43 ఉండటం ఇందులో బాధాకర విషయం. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే దేశంలోనే త్రిపుర టాప్ ప్లేస్ లో ఉంది, ఆ రాష్ట్ర జనాభాలో ఏకంగా 62 శాతం మంది మద్యం సేవిస్తారు అని తెలుస్తుంది. రెండవ స్థానంలో చత్తీస్గడ్, మూడవ స్థానంలో పంజాబ్ ఉన్నాయి. ఇది కేవలం మగ వాళ్లకు సంబంధించిన లెక్కలు మాత్రమే అని సర్వే స్పష్టం చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: