ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. నూతన సంవత్సర రోజు అనేది ఒక సంవత్సరం ముగింపు తరువాత మరుసటి సంవత్సర ప్రారంభ రోజు జరుపుకునే ఒక వేడుక. కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అంటూ ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకునే వేడుక. ప్రపంచవ్యాప్తంగా ఉరిమే ఉత్సాహంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంటారు. పండుగైనా, ఉత్సవమైనా... ఒక్కో దేశంలో ఒక్కోలాగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నూతన సంవత్సర వేడుకలు కూడా. కొన్ని దేశాల్లో ప్రజలు పార్టీలు, పబ్‌లకు అంకితమైతే.. మరికొన్ని దేశాల్లో కుటుంబ సమేతంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు.  

 

ఇక  శివార్లలోని పలు రిసార్ట్స్‌లు, నగరంలోని పలు స్టార్ హోటళ్లు ఆకర్షనీయమైన ప్యాకేజీలతో యువతను ఆకట్టుకునేందుకు భలే ఆఫర్లను ప్రకటిస్తాయి.  31 రాత్రి నూతన సంవత్సరం వేడుకను పురస్కరించుకుని డిస్కౌంట్‌లు ఇస్తుండగా, మరికొన్ని బహుళ జాతి కంపెనీలు, ఐటీ కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయటంలో నిమగ్నమై ఉంటాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో యువత డ్యాన్సులు, కేరింతలతో హోరెత్తిస్తూ, పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.  ఈ వేడుకలను యూరప్‌, అమెరికా, ఆసియా దేశాల్లో వేరువేరుగా సెలబ్రేట్‌ చేసుకున్నా అందరి ఆశయం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడమే.

 

 కొత్త సంవత్సర వేడుకలను అమెరికా ఘనంగా జరుపుకుంటుంది. న్యూయార్క్‌ నగరంలోని టైంస్కే్వర్‌ వద్ద ప్రతి సంవత్సరం ఒక పెద్ద బాల్‌ను ఎగురవేస్తారు. పాత ఏడాది ఇంకా ఒక నిమిషంలో ముగుస్తుందనగా ఆ బెలూన్‌ను పోల్‌పై నుంచి మెల్లగా కిందకు దింపుతారు. సరిగ్గా పన్నెండు గంటలు కావడంతో ఆ బంతి నేలను తాకుతుంది. ఆ బంతి నేలను తాకీ తాకగానే అందరు పెద్ద పెట్టున ‘హ్యా పీ న్యూఇయర్‌’ నినాదాలతో అక్కడి వారంతా ఆనందంతో కేరింతలు కొడతారు.  ఆస్ట్రేలియాలో వెలుగుజిలుగులు ఆస్ట్రేలియన్లు బాణాసంచా కాలుస్తూ.. సెలబ్రేట్‌ చేసుకుంటారు. పెర్త్‌ నగరంలోని రేస్‌ కోర్స్‌ గ్రౌండ్గ అయిన గ్లౌసెస్టర్‌ పార్క్‌ ఏటా నూతన సంవత్సర వేడులకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.  సిడ్నీలో జరిగే ఉత్సవాలు లైట్‌ అండ్గ్‌ మ్యూజిక్‌ షోలతో అలరిస్తాయి.

 

న్యూజీలాండ్ లో బాణాసంచా కొత్త సంవత్సరం వేడుకల్లో  పాల్గొంటారు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే తొలి దేశం న్యూజీలాండ్‌ కావడం విశేషం. న్యూజీలాండ్‌ రాజధాని ఇంటర్నేషనల్‌ డేట్‌లైన్‌కు తొలిసారిగా ఈ దేశాన్ని పలకరిస్తుంది.ఆఫ్రికాలో ఆఫ్రికాలోని పలు దేశాలు న్యూ ఇయర్‌ వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులలో కలిసి అత్యంత ఉత్సాహంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక్కడి ప్రజలు చర్చ్‌ గంటలు మోగించడం ద్వారా కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇక్కడ ప్రతీ దేశం ఒక ప్రత్యేక శైలిలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: