ప్రస్తుత కాలుష్య ప్రపంచంలో మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్యల్లో ఒకటి జుట్టురాలడం. ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్యను పూర్తిగా తగ్గించడం కష్టమైన పనే నిజంగా. అయితే ఈ సమస్యకు డాక్టర్లు చెప్పే కొన్ని జాగర్తలు పాటిస్తే వీటినుంచి కాస్త బయట పడవచ్చు. అవి ఏమిటో ఒకసారి మేరె చుడండి.

 

1. బయటికి వెళ్లినప్పుడు కచ్చితంగా తలని స్కార్ఫ్, టోపీ సాయంతో తలని కవర్ చేయాలి. ముఖ్యంగా పొల్యూషన్ ఏరియాలో తిరిగినప్పుడు ఈ చిట్కాని తప్పకుండా చూసుకోవాలి.

 

2. తలలో ఎప్పటికప్పుడు దుమ్ము పేరుకుపోయి స్కాల్ఫ్‌ పై చుండ్రులా ఇది తయారు అవుతుంది. అందువల్ల రెగ్యులర్‌ గా షాంపూతో తలని శుభ్రం చేసుకోవాలి. మగవారు వీలైతే రోజూ లేదా రోజు విడిచి రోజు, మహిళలు వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తే మంచిది.

 

3. హెయిర్ స్టైలిషింగ్ కోసం చాలామంది హెయిర్ డ్రయ్యర్స్, కర్లర్స్ ఉపయోగించుకుంటారు. అయితే ఎక్కువగా వేడివి ఉపయోగించడం వల్ల జుట్టు చిట్లిపోవడం, గడ్డిలా మారి రాలిపోవడం వంటివి జరుగుతుంది. అందుకని వీటికి కొంత దూరంగా ఉంటే అంతమేలు.

 

4. జుట్టుకి తేమని అందించడం అనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది జిడ్డుగా ఉంటుందని నూనె అసలు వాడరు. అయితే, తలస్నానం చేసే ముందురోజు జొజొబా, బాదం వంటి ఆయిల్స్‌ ని తలకి మసాజ్ చేసి మర్నాడు ఉదయం తలస్నానం చేయడం వల్ల చాలా మంచి ఉపయోగం కలుగుతుంది.

 

5. మంచి కండీషనర్ కూడా జుట్టుని కాపాడడంలో సహాయపడుతుంది. కాబట్టి వారంలో కచ్చితంగా మంచి కండిషనర్‌ ని ఉపయోగించడం వల్ల జుట్టు పాడవ్వకుండా చూస్తుంది.

 

6. సహజసిద్ధమైన హెయిర్ మాస్క్‌ లు వేయడం కూడా చాలా అవసరం. ఇందుకు ఒక అరటిపండులో పాలు, కోకో పౌడర్లు కలిపి స్మూత్ పేస్ట్‌లా చేసి తలకు పెట్టి అరగంట ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయించాలి. దీనివల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.

 

7. షాంపూ, కండీషనర్‌ లు ఏవి పడితే అవి అసలు ఉపయోగించకూడదు. మీ జుట్టు జిడ్డుగా ఉన్నట్లైతే ఆయిలీ ఫ్రీ షాంపూని, అదే మీ జుట్టు డ్రైగా ఉంటే కచ్చితంగా మాయిశ్చరైజింగ్ షాంపూతో తలస్నానం చేసుకోవడం మంచిది.

 

8. బయటకి వెళ్లే సమయంలో హానికరమైన UV కిరణాలు పడకుండా తగిన జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకోవాలి. అంటే కచ్చితంగా సన్‌ స్క్రీన్ క్రీమ్, స్ప్రేలు వాడడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

 

ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ శిరోజాలను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: