యూట్యూబ్ ఇప్పుడు ఏం కావాలన్నా ఇదే.. ఏం తెలుసుకోవాలన్నా ఇదే.. అందుకే అంతగా పాపులర్ అయ్యింది. దీని కారణంగా చాలా మంది ప్రతిభావంతులు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. అలాంటి వాడే ఈ కుర్రాడు పేరు రాహుల్ వెల్లాల్.. ఊరు కర్ణాటకలోని బెంగళూరు. మనోడి పాటలంటే బాగా ఇష్టం. ఆ ఇష్టం చూసి చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్పించారు.

 

ఇప్పుడు ఆ సంగీతం ద్వారానే దూసుకుపోతున్నాడు. యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యాడు. రాహుల్ ఏడేళ్లకే కచేరీలు చేయడం మొదలుపెటాడు. అతను పాడి విడుదలచేసే వీడియోలు సైతం నెట్లో బాగా ఫేమసైపోయాయి. ముఖ్యంగా- 'బ్రహ్మమొక్కటే' అన్న అన్నమయ్య కీర్తననైతే ఇప్పటిదాకా కోటిన్నర మంది చూశారు. అతని సొంత యూట్యూబ్ ఛానెల్ కేమో 35 లక్ష మంది సబ్ స్క్రయిబర్లు ఉన్నారు.

 

తిరుమల తిరుపతి దేవాలయంలో పెద్ద పెద్ద విద్వాంసులకి దీటుగా గంటన్నరపాటు కచేరీ చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానంవాళ్ల ఎస్వీబీసీ ఛానెల్ లో వారం వారం అన్నమయ్య కీర్తనలు పాడే విద్వాంసుల్లో అతి చిన్నవయసువాడు రాహులే! ప్రస్తుతం బెంగళూరులో కార్నెల్ పబ్లిక్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ కుర్రాడు మలేషియా, సింగపూర్, లావోస్, అబుదాబీ దేశాల్లోనూ పాడాడండోయ్. మీరూ వినండి.

మరింత సమాచారం తెలుసుకోండి: