ఉరుకుల పరుకుల జీవితంలో మనుషులు బంధాలకు చెక్ పెట్టేస్తూ డబ్బుల వెంట పరిగెడుతున్నారు. సమాజంలో డబ్బుకు విలువ పెరిగిన కొద్దీ కుటుంబాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తూ డబ్బులు సంపాదించటానికి, సంపదను పెంచుకోవటానికే పరిమితమవుతున్నారు. చాలా మంది పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడుతున్నామని అదే సమయంలో ప్రేమను కోల్పోతున్నామని చెబుతూ ఉంటారు. 
 
కానీ కట్టల కొద్దీ పైసలు కూడబెట్టినా పిల్లలను హాస్టళ్లలో పెట్టి చదువు, ర్యాంకుల పోటీ ప్రపంచంలో పరుగెత్తిస్తూ కనీసం తమతో ఇంట్లో ప్రేమగా ఆడుకోవడానికి కూడా ఎవరూ ఉండని విధంగా చేసుకుంటున్నారు. ఆ తరువాత బంధాలు, అనుబంధాల విలువలు తెలియని వాళ్ల పిల్లలు వీళ్లను అనాథ శరణాలయంలో పడేసి తమ భవిష్యత్తును తామే చూసుకుంటున్నారు. డబ్బు అవసరమే కానీ బంధాలను, అనుబంధాలను దూరం చేసుకుంటూ డబ్బే పరమావధిగా సంపాదిస్తే ఆ డబ్బు వలన ఆస్తులు కూడబెట్టుకున్నా ఆ డబ్బు కంటే విలువైన ప్రేమ, ఆప్యాయత, అభిమానం పొందలేము. 
 
తీరా శరీరంలో సత్తువ మొత్తం క్షీణించి వృద్ధ్యాప్యంలో ఉన్న సమయంలో కళ్లు ముందు మెదిలే జీవితంలో ఏం సంపాదించుకున్నామనే ప్రశ్నకు డబ్బు తప్ప మరొకటి కనబడదు. సగటు మనిషి నేడు బ్రతుకుతున్న జీవనం ఇదే. బంధాలు, ప్రేమ లేకపోతే ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బు వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ మనిషి మాత్రం అవన్నీ మరిచిపోయి డబ్బు వెంటే పడుతూ డబ్బే లోకంగా, డబ్బే లక్ష్యంగా జీవనం సాగిస్తూ ఉండటం గమనార్హం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: