ప్ర‌స్తుత స‌మాజంలో ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక అన్నింటికీ స్మార్ట్ ఫోనే ఆధారంగా మారింది. నేటి అవసరాలు, ఆధునిక టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఈ క్ర‌మంఓల‌నే స్మా ర్ట్‌ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృ ష్టమో కాని స్మార్ట్‌ఫోన్ నేడు మానవ దైనం దిన జీవితంలో భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, అందల మెక్కేసినట్లు గా చెలరేగిపోతోంది నేటి యువత. స్మార్ట్ ఫోన్ వాడకం అనేది అవసరం నుండి వ్యసనంగా మారింది.

 

ఈ కాలం లో చిన్న పిల్లోల్ల నుండి పండు పండు ముసలి వాళ్ళ వరకు దాదాపు అందరు స్మార్ట్ ఫోన్ల లే వాడుతున్నారు. దీంతో ఆన్‌లైన్ వాడ‌కం కూడా విప‌రీతంగా పెరిగిపోయింది.  ఇక నేటి యువ‌త‌కు శ్వాస.. ధ్యాస.. రెండూ ఆన్‌లైనే! నిత్య జీవితం దిండుకింద ఒదిగిపోయిన స్మార్ట్ ఫోన్‌తో ప్రారంభం.. హాయ్‌లు.. గుడ్ మార్నింగ్‌లతో మొద‌లై.. బైల‌తో ముగుస్తోంది. కుటుంబంలో ఏం జ‌రుగుతోంది. త‌ల్లీ దండ్రీ త‌మ కోసం ఎంత క‌ష్టిస్తున్నారు? అని ఆలోచించే యువ‌త నేటి కాలంలో 10 ప‌ర్సెంట్ ఉంటే అదృష్ట‌మే అని చెప్పాలి.

 

ఈ ఆన్‌టైన్ టెక్నాల‌జీ మన జీవితాన్ని ఎంతలా మార్చేశాయి అంటే, దూరం గ ఉండే అమ్మ నాన్న తో ఫోన్ లోనో లేదా వీడియో కాల్ లోనో మాట్లాడేది పోయి, హే మామ్ డాడ్ హాయ్ అంటూ వాట్స్ అప్ లో మెసేజ్ లు , యాక్సిడెంట్ అయితే ఫీలింగ్ సాడ్ అంటూ సెల్ఫీ లు దిగి ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ యాప్స్ లో పెట్టడం ఫాషన్ అయిపోయింది. ఇక ఆన్‌లైన్ గేమ్స్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే ఈ  న్‌లైన్‌ గేమ్స్‌వల్ల కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటు న్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ప్రజల జీవితాలతో చెలగాట మాడటమే కాక, మరికొన్ని సందర్భాల్లో కాపురాలు కూలుస్తున్నా యి.  

మరింత సమాచారం తెలుసుకోండి: