శీతాకాలం వచ్చింది అంటే చాలు మంచు కురిసే సమయం.  ఈ మంచు కురిసే సమయంలో అనేక ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి.  మంచుకురిసే వేళ చాలామంది మంచు ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు.  ఇక తుషార సమయం, పడమటి సంధ్యారాగం ఈ రెండు ఈ శీతాకాలంలో చాలా హాయిగా ఉంటాయి.  వెచ్చగా ఉంటాయి.  సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా సూర్యుడి లేత కిరణాలు తాకిన సమయంలో ఒళ్ళు జల్లుమంటుంది.  


అందుకే ఆ సమయంలోని సూర్యకిరణాలు చూసేందుకు చాలామంది గోవా, మనాలి, సిమ్లా, జైసల్మేర్, కేరళ వంటి ప్రాంతాలకు పరుగులు తీస్తుంటారు.  ఇలా అక్కడికి వెళ్లి ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనీ అనుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు.  అలా ఎంజాయ్ చేయడానికి అనువైన ప్రదేశం గోవా.  గోవా ఎప్పుడు వెళ్లినా చాలా బాగుంది.  అందులోను ఈ శీతాకాలంలో ఇంకా బాగుటుంది.  


గోవాలో ఇసుక బీచ్ లు ఆహ్లాదకరంగా ఉండటమే కాదు అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి.  గోవా ఇసుక తెన్నెలు చల్లని వాతావరణంలో వెచ్చగా ఉంటాయి.  మిగతా ప్రదేశాల్లోని బీచ్ లకు, గోవా బీచ్ లకు చాలా తేడా ఉంటుంది.  మిగతా బీచ్ లు మాములుగా ఉంటె, గోవా లో ఉండే బీచ్ లు యూరప్ దేశాల్లో ఉన్నట్టుగా ఉంటాయి.  అందుకే అందరిని ఆకట్టుకుంటాయి.  పైగా అక్కడ ఉండే రిసార్డ్స్ లు అద్భుతంగా ఉంటాయి.  


ఇక గోవా తరువాత మనాలి అందంగా ఉంటుంది.  హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతం యూరప్ దేశంలో అందమైన ప్రాంతాలుగా ఉంటాయి.  ఈ ప్రాంతంలో చలికాలంలో మంచు కురుస్తున్నప్పుడు దానిని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.  దీని తరువాత మంచుతో కప్పబడిన దేవదారు వృక్షాలతో అందంగా కనిపిస్తుంది. అక్కడ అందమైన ఇల్లు.. ఆ ఇంటిపైన మంచు అద్భుతంగా ఉంటుంది.  దీంతో పాటుగా రాజస్థాన్ లోని జైసల్మీర్, కేరళ కూడా అందంగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: