సంక్రాంతి వచ్చింది అంటే చాలు రంగవల్లులు... పచ్చని. తోరణాలు.. హరిదాసుల కీర్తనలు.. బంధువుల సందడి.. పనివాళ్ళు చేసే హడావిడి.. ఎగిరే గాలిపటాలు.. ఇవన్నీ సరదాలు తీర్చుకునే ఒక పండుగ ఈ సంక్రాంతి.. ఈ సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండోవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ ఇలా జరుపుకుంటారు.. ఇకపోతే ఈ సంక్రాంతి పండుగకు చాలా సరదాలు ఉంటాయి.. 

 

పచ్చని పొలాలు ముగ్గులు గొబ్బెమ్మలు ఇలా ఒకటేమిటి అన్నీ ఈ పండుగ నాడు జరుగుతాయి..పట్టణాలలో ఉన్న వాళ్లంతా పల్లెకు పయణమవుతారు..ఎన్నో రకాల పిండి వంటలు ఈ పండుగ నాడు కనిపిస్తాయి. ఇకపోతే మామూలు సమయాల్లోనే తెలుగింటి ఆడపడుచులు రంగవల్లి తో ఇంటికి ఒక హంగును తీసుకొస్తారు.. ఈ పండుగకు మరింత ప్రత్యేకం అని చెప్పాలి..అందుకే సినిమాలు కూడా ఈ సంక్రాంతి పండుగ నాడే ఎక్కువగా కనిపిస్తాయి..

 

సంక్రాంతి నెల ప‌ట్టిన నాటి నుంచి ప్ర‌త్యేక రంగ‌వ‌ల్లులు అలంక‌రించ‌డం కామ‌నే. అయితే, సంక్రాంతి ల‌క్ష్మిని ఆహ్వానిస్తూ..వేసే బోగి పండుగ నాడు ముగ్గుకు ప్ర‌త్యేకత ఉన్న‌ట్టుగానే క‌నుమ నాడు హ‌రిదాసులు, గంగిరెద్దులు స‌హా ప్ర‌కృతికి ప్ర‌ణ‌మిల్లుతూ కృత‌జ్ఞ‌త‌ల‌ను ఆవిష్క‌రిస్తూ వేసే ముగ్గులు ప్ర‌త్యేకం. అయితే, నేడు ఈ సంప్రదాయాల‌ను పాటిస్తున్న గ్రామాల సంఖ్య కూడా త‌గ్గిపోయింది. 

 

ఇప్పుడు గ్రామీణ ప్ర‌జ‌లంతా కూడా దాదాపు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోనే ఉంటుండ‌డంతో సంప్ర‌దాయాల‌ను పాటించేవారుతెలిసిన వారు కూడా క‌రువ‌వుతున్నారు. పట్టణీకరణ ను దృష్టిలో పెట్టుకొని చాలా వరకు పల్లెలు కరువయ్యాయి.. అందుకే పండగలకున్న ప్రత్యేకత కూడా తగ్గిపోయింది.. అందుకే ఈ పండుగల చేసుకునే వారు ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో కనిపిస్తారు.. మొత్తానికి అలా ఈ పండుగలు ఇప్పుడు జరుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: