పండుగ ముంగిటికి వచ్చేసినా.. సెలవలు దొరక్కో.. చివరి నిమిషంలో ప్రయాణమయ్యో.. చాలా మంది ఇంకా ప్రయాణాల్లోనే ఉన్నారు. పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారితో రైళ్లు, బస్సులుకిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ శుక్ర వారం నుంచి కొనసాగుతోంది.

 

ప్రతిరోజూ నడిచే 298 రైళ్లకుతోడు ఆదివారం 12 అదనపురైళ్లు నడుపుతున్నారు. సోమవారం కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. జనరల్ బోగీల్లో ప్రయాణికులు ప్రవేశద్వారం నుంచి కాకుండా.. కిటికీ ల్లోంచి దూరి మరీ సీట్ల కోసం కుస్తీలు పడుతున్నారు.

 

ప్రయాణికుల రద్దీతో స్టేషన్లోని టికెట్ కౌంటర్లతోపాటు.. ప్లాట్‌ఫాంలు ఇసుక వేస్తే రాలనట్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. తొక్కిసలాటకు అవకాశం లేకుండా.. రైల్వే ఉన్నతాధికారులతో పాటు.. ఆర్పిఎఫ్, జీఆర్పీ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

 

జనరల్ బోగీల్లో ప్రయాణించే వారిని వరుసలో ఉంచి ఎక్కించేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్లాట్‌ఫాంనకు రైలు వచ్చేసరికి వరుసలో ఉన్నవారు పరుగులు పెట్టి తోసుకుంటూ రైలు ఎక్కుతున్నారు. అందుకే చిన్నపిల్లలు, వృద్ధులతో ప్రయాణం చాలా జాగ్రత్త.. ఏదైనా జరిగితే పండుగ ఆనందం ప్రయాణంలోనే ఆవిరవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: