మామూలుగా ఒక నంబర్ కు మంచి క్రేజ్ వస్తె ఆ నంబర్ ను చాలా మంది తీసుకోవా లని అనుకుంటారు..ఇంకా చెప్పాలంటే ఇష్టమయిన వాహనాన్ని తీసుకున్న వాళ్ళు మంచి నంబర్ నుండి ఆ నంబర్ బాగా కలిసి వస్తే వాటికి క్రేజ్ కుడా మాములుగా లేదని చెప్పాలి. కొంతమంది చూసుకొని మరి నంబర్లను కొనుకుంటారు. అందుకే వీటి కి క్రేజ్ కూడా ఎక్కువే. 

 

అయితే, మహానగరంగా భాగ్యనగరం లో అయితే బండి ఎంత పెద్దది కాదమ్మా నంబర్ ముఖ్యం అని చాలా మంది అనుకుంటారు. అందుకే 1111 గల నంబర్లకు ప్రాముఖ్యత చాలా ఎక్కువనే చెప్పాలి. అందుకే మహానగరంలో  చాలా మందికి ఈ నెంబర్ అంటి పిచ్చి ఎక్కువగా ఉంటుంది. మరో విషయమేంటంటే.. 9999 నంబర్ కు మాత్రం క్రేజ్ ఎక్కువే.. 

 

విషయానికొస్తే.. ఫ్యాన్సీ నెంబర్ లు ఎన్ని ఉన్నా సరే దీనికి సిని రాజకీయ పెద్దలు కూడా ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు. తాజాగా టీఎస్13ఈపీ కొత్త సిరీస్‌ రావడంతో ఆల్‌ 9999 కోసం తీవ్ర పోటీ నెలకొంది. పశ్చిమ మండలం ఆర్టీఏ కార్యాలయం చరిత్రలోనే తొలిసారిగా ఈ నెంబర్ నెంబర్‌ రూ.8.5లక్షలు పలకడం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.

 

కొడాలి శ్రీకాంత్‌, గ్రీన్‌ స్టోన్‌ ఇన్‌ స్ర్టెక్చర్‌ కంపెనీ రూ.1,06,525, అక్బర్‌ రూపాణి రూ.1,81,100,సంజయ్‌ సింగ్‌ ఠాకూర్‌ రూ.2,30,000కు పోటీ పడగా కొడాలి శ్రీకాంత్ అనే వ్యక్తి రూ.8.5లక్ష లకు ఈ నెంబర్‌ను దక్కించున్నా రని ఆర్టీఏ సీపీ వెంకటేశ్వర రావు మీడియా కు తెలిపారు. టీఎస్‌ 13ఈపీ 9999 నెంబర్‌ను కొడాలి శ్రీకాంత్‌ 8లక్షల 50వేల కు డ్రా సిస్టమ్‌ ద్వారా తన సొంతం చేసుకున్నా రని వార్తలు వినపడుతున్నాయి. 5 లక్షల వరకు ఈ నంబర్ ఖరీదు ఉంటుంద ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: