ఎప్పటికప్పుడు అప్ డేట్ కావడంలో పాశ్చాత్య దేశాలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారే ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ అందుకు ఓ ఉదాహరణ. తాజా భాషా శైలికి అనుగుణంగా తమ డిక్షనరీలో ఎప్పటికప్పుడు కొత్త పదాలు చేరుస్తుందీ డిక్షనరీ.

 

ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా వెలువడుతున్న ఈ డిక్షనరీ మొదట 1948లో విడుదలైంది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. తాజాగా మరో 26 భారతీయ పదాలకు ఆక్స్ ఫర్డ్ చోటు కల్పించింది. అడ్వాన్స్ డ్ లెర్నర్ నిఘంటువు 10వ ఎడిషన్ ను విడుదల చేసిన ఆక్స్ ఫర్డ్ .. మొత్తం వెయ్యి కొత్త పదాలను ఇందులో చేర్చింది. అందులో భారతీయ పదాలు 26.

 

అవేంటో తెలుసా.. ఇటీవల నిత్యం మనం వాడుతున్నవే అవి.. ఆధార్, చాల్ , డబ్బా, హర్తాల్ , షాదీ, లూటర్ , ఉప జిల్లా.. ఇలా మొత్తం 26 ఉన్నాయి. ఫిజికల్ డిక్షనరీలో కంటే డిజిటల్ డిక్షనరీలో మరో రెండు పదాలు ఎక్కువ చేర్చారు.

 

ఇక కొత్తగా చేరిన ఇంగ్లీష్ పదాలేంటో తెలుసా.. చాట్ బోట్ , ఫేక్ న్యూస్ , మైక్రో ప్లాస్టిక్ ఇలాంటివన్నమాట. తమ వెబ్ సైట్ , యాప్ ద్వారా నిర్వహిస్తున్న భాషా బోధన కార్యక్రమాలను ఆధారంగా చేసుకుని సేకరించిన సమాచారం మేరకు ఆక్స్ ఫర్డ్ ఈ కొత్త పదాలను నిఘంటువులో చేర్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: