మీరు గెలిచారా.. అయితే మీ జీవితం ఇక ముళ్ల బాటే.. అదేంటి విజయం సాధిస్తే ముళ్ల బాట ఎందుకు అవుతుంది.. విజయమే కదా అందరూ జీవితంలో కోరుకునేది. మరి అది దక్కించుకున్నప్పుడు ఇక ముళ్ల బాట ప్రస్తావన ఏంటి.. అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు కథ.

 

ఒకసారి విజయం వస్తే.. అది మీకు ఓ అలవాటు అవుతుంది. విజయం ఇచ్చే కిక్కుకు మీరు బానిస అవుతారు. మొదటి సారి విజయం కోసం ఎంతో తాపత్రయపడి కష్టపడిన మీరు.. ఆ తర్వాత విజయం కోసం ఏం చేసేందుకైనా వెనకాడరు. నిరంతరం మీ మనసులో గెలుపు ఒక్కటే కనిపిస్తుంది.

 

ఇక్కడ అసలు విషాదం మొదలవుతుంది. ఈ విజయం బాటలో మీ వ్యక్తిగత జీవితం నలిగిపోతుంది. మీ కుటుంబ జీవితం దెబ్బ తింటుంది. మీ వ్యక్తిగత అభిరుచులూ పక్కకుపోతాయి. ఒక్క విజయమే మీకు కంటికి కనిపిస్తుంది. అందుకే మీరు గెలిచారా.. అయితే మీ జీవితం ఇక ముళ్ల బాటే అంటోంది.

 

అయితే ఇది ఓ హెచ్చరిక మాత్రమే. వీటన్నింటినీ బ్యాలన్స్ చేస్తూ కూడా మీరు విజయం సాధిస్తే అదే అసలైన విజయం. అలా కాకుండా కేవలం గెలుపు కోసమే ప్రయత్నించి.. మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేస్తే.. మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోతారు. ఈ స్పృహ విజేతకు నిరంతరం అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: