ప్రేమ అంటే ఒకరిమీద మరొకరికి ఉన్న ప్రేమ అనంతం అని చెప్పబడే అద్భుతం.. మనసులోని భావాలను చెప్పే మార్గం ఈ ప్రేమ .. ఇద్దరినీ మానసికంగా ముడి వేసిన బంధం ఈ ప్రేమ ..సముద్రం లాగా ప్రేమను కూడా కొలవలేమన్న సంగతి తెలిసిందే..అందుకే ప్రేమను ప్రకృతి అందంగా చాలా మంది పిలుస్తుంటారు.. ఇకపోతే ఈ ప్రేమను అతిగా ప్రేమించిన వారు తమ ప్రేమకు గుర్తుగా అద్భుత కట్టడాలను కట్టించి చరిత్రలో మిగిలిపోతారు.. ఉదాహరణకు తాజ్మహల్..

 

 

అయితే ప్రేమను చెప్పాలంటే అవతలి వ్యక్తి మనసును తెలుసుకొని ఉండాలి.. అప్పుడూ ఆ వ్యక్తి ప్రేమ అనేది తెలుస్తుంది.. అయితే ప్రేమ కోసం ప్రేమించిన అమ్మాయిల కోసం ఒక్కప్పుడు రాజ్యాలను కూడా వదులుకునేవారని చరిత్ర చెబుతోంది.. అందుకే ప్రేమ గొప్పది అంటారు.. ప్రేమలో మునిగి జంటలు ప్రేమను పలు రకాలుగా వ్యక్త పరుస్తారు..మరో విషయమేంటంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఏ వయసులో నైనా ప్రేమ పుడుతుందని అంటున్నారు.. 

 

 

ఇలాంటి ప్రేమలు భారత దేశంలో అయితే లేవని చెప్పాలి.. ప్రేమ పుట్టాలంటే ముందు ఆకర్షణ పుట్టాలి.. కళ్ళు కళ్ళు కలుసుకొని అవతలి వ్యక్తి మనసుతో మాట్లాడాలి.. అప్పుడు అతని అంగీకారంతో  ప్రేమ పడుతుందట.. అయితే మగావారిలో ఇరవై ఏళ్ళకు ఆడవారిలో  పద్దెనిమిది ఏళ్లకు ఈ ప్రేమ పుట్టడం సహజం.. ఆ వయసులో ప్రేమలో పడ్డారంటే అర్థం ఉంది.. సరైన వయసులోనే ఈ ప్రేమ పుట్టిందని అర్థమట...

 

ఈ వయసులో ఉన్న యువత ఏదైనా చేయాలని , అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నారు.. అప్పుడే  మనుషుల విలువలు కుటుంబ బాంధవ్యాలు తెలుస్తాయని అంటున్నారు నిపుణులు.. అందాన్ని చూసి...డబ్బును చూసి పుడితే అది ప్రేమ అవ్వదు..ఇచ్చిపుచ్చుకునే మనసును చూడాలి తప్ప డబ్బు హోదా పరపతిని చూడకూడదని పెద్దలు అంటుంటారు... ప్రేమించిన వ్యక్తిని భాగస్వామిగా చేసుకుంటే ఇటు అతను సుఖ పడటమే కాకుండా కుటుంబం కూడా బాగుంటుంది... ప్రేమలో మునిగి తేలుతున్న ప్రేమికులకు హ్యాపీ వాలెంటైన్స్ డే...

మరింత సమాచారం తెలుసుకోండి: