చాలామంది జీవితంలో కాస్త చిన్న కష్టం రాగానే కుగింపోతారు.. అంతకు ముందు వచ్చిన కష్టాలను కూడా తలచకుని..ఇక తన జీవితం ఇంతేనని నెగిటివ్ థాట్ లోకి వెళ్లిపోతారు. కాస్త ఎదురు చూసే ఓపిక కనిపించదు.. కానీ కష్టం వెంట సుఖం.. సుఖం వెంట కష్టం జీవితంలో సాధారణం అన్న విషయాన్ని గుర్తించరు.

 

 

గమనించాల్సింది ఏంటంటే.. ఆనందం కోసం బతికే మనుషులకు భగవంతుడు తప్పక సహాయం చేస్తాడు. సత్యం రుజువు చేసి, ఎందుకు విషాదంగా ఉండకూడదో అర్జునుడికి తెలియజేసిన శ్రీకృష్ణుడిలా మనకూ సహాయపడతాడు. ఎందుకంటే ఆనందం మన జన్మహక్కు.





ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.. ఆనందంగా జీవించడం కోసం అసలు జీవన రహస్యం తెలుసుకోవాలి. లేకపోతే జీవనం మొదటి పొర చూసి, అంతా విషాదమేనన్న భ్రమలోనే ఉంటాం. నాచును తొలగిస్తే లోపల నిర్మలమైన నీరుంటుంది.





అలాంటిదే జీవితం కూడా.. తెల్లవారిన వెంటనే సూర్యుడు కనిపించడు. కొంతసేపు ఓపిక పట్టి నిరీక్షిస్తే తూర్పు ఎర్రబారుతుంది. లోకమంతా వెలుగుతో నిండిపోతుంది. జీవించడం అయిపోయిన తరవాతా ఆనందం కనుగొనలేని మనిషి అసంతృప్తికి చిరునామాగా మిగులుతాడు. మీరు అలా కాకూడదు. కాస్త నిరీక్షించండి.. మీకోసం ఓ గుడ్ న్యూస్ ఎదురు చూస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: