మన పురాణాలు విజ్ఞాన భాండాగారాలు. సైన్స్ సంగతుల సంగతేమో కానీ.. నైతిక ప్రవర్తన విషయంలో అవి అందించే జీవన సూత్రాలు ఎన్నో.. అందుకు ఓఉదాహరణ శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణుని పేరు వినగానే గోపికలు, రాసలీలలు, వెన్న దొంగతనాలు, బృందావన విహారాలు, అష్టభార్యలు ఇవే గుర్తుకొస్తాయి చాలా మందికి.

 

 

ఆహా.. జీవితమంటే నిజంగా శ్రీకృష్ణుడిదే! అమ్మాయిలతో వెన్నెల షికార్లు, బృందావనంలో ఆటపాటలు.. అలా వుండాలి జీవితం అనుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు కష్టాలలో నిగ్రహం చూపాడు. శ్రీకృష్ణుడు ఆచరించి, భరించి చూపించాడు. వాస్తవానికి శ్రీకృష్ణుడు అనుభవించిన వాటిలో ఒక చిన్న కష్టాన్ని కూడా నిజజీవితంలో మనం భరించలేం. చెరసాలలో పుట్టిన దగ్గర నుంచి అనేక రాక్షసులను సంహరించడం.. ఆ తర్వాత అన్నీ శ్రీకృష్ణుడి కష్టాలే. ఆ కష్టాల జాబితా చెప్పాలంటే.. పుస్తకాలే రాయాలి.

 

 

కష్టాల్లో ధీరోదాత్తంగా నిలబడినవారికే సుఖాలందుకునే అర్హత, అవకాశం వుంటాయి. దైవాన్ని విమర్శించే హక్కు, నిందించే అధికారం మనకు లేవు. మనం పడే కష్టాలు, భగవంతుడు పడిన కష్టాలముందు ఒక లెక్క కాదు. మనం శ్రీకృష్ణ పరమాత్మలోని ధీరోదాత్తతను అలవరచుకోవాలి. స్థితప్రజ్ఞులం కావాలి. అందుకోసం కావలసిన మనోబలాన్ని మనకు ఇచ్చేందుకే శ్రీకృష్ణుడు ఇంత జగన్నాటకం ఆడి చూపించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: