మనలో చాలా మంది ఒకరి గురించి మరొకరికి చెడుగా మాట్లాడుకునే అలవాటు ఉంది. మన ముందు లేని వ్యక్తుల గురించి అలవోకగా చెడుగా మాట్లాడుతుంటారు చాలా మంది. అయితే.. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఒకరి గురించి నీకు చెబుతున్నాడు అంటే నీ గురించి మరొకరికి చెప్పడా ?

 

 

అందుకే జీవితంలో ఎప్పుడైనా మన సొంత అవగాహన మనకు ఉండాలి. అంతే కానీ ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేయకూడదు.. ప్రభావితం కాకూడదు. ఎవరైనా ఏదైనా చెప్పినా.. దానిలో మంచి చెడు బేరీజు వేసుకోవాలి. వాస్తవానికి.. మనమేదో పెద్ద తోపులం అనుకుంటాం కానీ.. మనం చాలా అమాయకులం..

 

 

ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాం.. కాకపోతే.. ఆ చెప్పేవాడు కాస్త నమ్మకంగా చెప్పాలంతే. కానీ ఇలాంటి విషయాలు మన కొంపలు ముంచుతాయి. మనకూ, మన ఆప్తులకు గొడవలు పెట్టాలనుకునేవారు.. మన ఆప్తులపై మనకు లేనిపోనివి కలిపి చెప్పే ప్రమాదం ఉంది.

 

 

కొందరు అతి జాగ్రత్తగా విషపు మాటలు మన చెవులకు ఎక్కిస్తారు. వాటిని మనం గుర్తించకపోతే.. జీవితంలో చాలా నష్టపోతాం. చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు చరిత్రలో చాలా మంది ఉన్నారు. అలాగే చెప్పుడు మాటలు విని సంసారాలని నాశనం చేసుకున్న వారూ ఉన్నారు. అందుకే బీ కేర్ ఫుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: