ప్రతి వ్యక్తికీ అంతో ఇంతో ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది లేని వాడు జీవితంలో ఏదీ సాధించలేడు. అయితే ఈ ఆత్మవిశ్వాసానికీ ఓ హద్దు ఉంటుంది. అది దాటిందంటే.. అది అతి విశ్వసం అవుతుంది. విచిత్రం ఏంటంటే.. మన విజయాలకు సదా తోడుండే ఆత్మవిశ్వాసం.. కాస్త డోసు పెరిగిందంటే అదే మన అపజయానికి కారణమవుతుంది.

 

 

ఈ ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసానికి ఉన్న తేడా చాలా చిన్నది. ఈ గీతను గుర్తిస్తే చాలు మన విజయాలకు అడ్డుకట్ట ఉండదు. కానీ చాలా మంది ఇక్కడే పొరబాటు పడతారు. అదే ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారితే.. అనేక అనర్థాలకు దారి తీస్తుంది.. అహంకారంగా మారుతుంది.

 

 

ఎప్పుడైతే మనం బలవంతులమని అహంకారానికి లోనవుతామో.. అప్పుడు విచక్షణ మరిచిపోతాం.. అందుకే.. ఎంతో బలం ఉన్నా పాము చలిచీమల చేత చిక్కి మరణిస్తుంది. మరి ఈ అహంకారాన్ని అడ్డుకునేదెలా.. తెలుసుకునేదెలా అంటారా.. అందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం.. మన గురించి మనం తెలుసుకోవడమే. మన గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత తక్కువ అహంకారం ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: