ప్రతి మనిషికి గాలి, నీరు, బట్ట, ఉండటానికి గూడు ఇది మాత్రమే కాకుండా శృంగారం కూడా అవసరమే. శృంగారం అంటే ఆసక్తి లేని వారు ఎవరో చెప్పండి. అయితే దాని మీద ఎంతో ఆసక్తి ఉన్న కొందరు మాత్రం పడకగదిలో నిరుత్సాహ పడుతున్నారు. తన శృంగార పార్టనర్ ని ఎలా మెప్పించాలి అనే విషయాలు తెలుసుకోకపోవడంతో నిరాశ నిస్పృహలో ఉండిపోతారు. ఇకపోతే ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో భార్యాభర్తలిద్దరూ కలిసి కాసేపు సమయం గడపడానికి కూడా కష్టమైంది. ఒకవేళ కలిసిన కాస్తోకూస్తో ఉన్న సమయంలోనే పార్ట్నర్ ను మెప్పించాలి. అయితే దీనికోసం నిపుణులు ఏం చేయాలో తెలుపుతున్నారు.

 

 

ఇందుకోసం ముందుగా పురుషులు కొన్ని అలవాట్లను మార్చుకోవాలని... అలవాట్లు మార్చుకుంటే శృంగారానికి తనివితీరా ఆస్వాదించ వచ్చని వారు చెబుతూ ఉన్నారు. కాకపోతే ఎక్కువ శాతం మంది తన భార్యలు ఎటువంటి ప్రయత్నం చేస్తే వారు సంతోష పడతారు అనే విషయాన్ని తెలుసుకోకుండా ముందుగా ఆ విషయంలో ఫీలవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి బెడ్ రూమ్ లోనే కాకుండా కొత్త ప్రదేశాల్లో కూడా వారిని తీసుకు వెళుతూ ఉండాలి. అలా చేయడం వల్ల వారికి ఆ విషయంలో కాస్త ఉత్సాహం పెరుగుతుంది. అలాగే ఎవరికైనా పాన్, గుట్కా, స్మోకింగ్, మందు తాగే వారికి ఈ విషయంలో కాస్త వారి భార్యలు నిరుత్సాహ పరచడం సాధారణమట. దీనికి గల కారణం తమ భార్యలకు వాటి మీద విరక్తి ఉండటమే. అందులోనూ పడకగదిలో అయితే స్త్రీలు అసలు అంగీకరించారు. ఆ వాసన దాదాపు చాలా మందికి స్త్రీలకు నచ్చదు.

 

 

అందుకని శృంగార సమయానికి ముందు సిగరెట్ కానీ, మందు తాగడం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మీతో ఉన్న మీ పార్టనర్ ని చాలా వరకు సుఖ పెట్టవచ్చు. అంతేకాకుండా చాలామందికి జంక్ ఫుడ్ తినే అలవాటు కూడా ఉంటుంది. ఇకపోతే వారానికి ఒకసారి రెండుసార్లు కదా అని తింటూ ఉంటారు వాటిని. నిజానికి అలాంటి ఫుడ్ కూడా వారి శృంగార జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి వాటికి కూడా తగినంత దూరంగా ఉంటే మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి మీకు శృంగారంపై ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది. అంతేకాదు మీరు తినే ఆహారంలో కూడా ఉప్పు చాలా వరకు తగ్గించు కుంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: