ఆకాశంలో గ్రహణాలు అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. సూర్య గ్రహణం గానీ చంద్ర గ్రహణం గానీ ఏర్పడినప్పుడు ప్రతీసారి మన పూర్వీకులు కొన్ని ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ గ్రహణాలు ఏర్పడినప్పుడు అలా ఆ పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే ఒక్కో గ్రహనానికి ఒక్కో పట్టు ఉంటుంది. అయితే నేడు  అతి పెద్ద సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం కావడం గమనార్హం.

 

 

 జ్యోతిషశాస్త్రం ప్రకారం కరోనా వైరస్ గతేడాది డిసెంబరులో ఏర్పడిన సూర్యగ్రహణంతోనే ప్రారంభమైంది. అయితే చాలా మంది గ్రహణం సమయంలో ఏ పని చేయొచ్చు.. ఏ పని చేయకూడదు అనే దానిపై క్లారిటీ ఉండదు. కొంత మంది పాటిస్తారు కొంతమంది పట్టించుకోరు.  అందులో గ్రహణం సమయంలో శృంగారంలో పాల్గొనొచ్చా ? అని సందేహ పడుతూ ఉంటారు. ఆ ఏర్పడిన సమయాన్ని అశుభంగా భావిస్తారు. కాబట్టి ఆ టైంలో శారీరక కలయికకు దూరంగా ఉండాలని జోతిష్యులు చెబుతున్నారు. గ్రహణం టైంలో శృంగారానికి దూరంగా ఉండాలి అంటారు. కొన్ని శాస్త్రాల ప్రకారం  అలాంటి సమయాల్లో  బిడ్డ కడుపులో పడటం మహిళలకు మంచిది కాదని నమ్ముతారు. ఒకవేళ అలా చేస్తే పుట్టబోయే పిల్లల్లో లోపాలు ఉంటాయని అంటారు. 

 

 

అయితే  దీన్ని మూఢనమ్మకంగా భావించి ఆ సమయంలో సంభోగం లో   పాల్గొన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య భర్తల కలిసినప్పుడు గర్భం దాల్చకుండా జాగ్రత్త వహించాలి. అలా చేయడం వల్ల గ్రహణం ప్రభావము గర్భం మీద పడకుండా ఉంటుంది. ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు  చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. గర్భిణీలు అసలు ఇల్లు వదిలి బయటకి వెళ్లకూడదు. ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి. మొక్కలు విరవడం , ఆకులు గిళ్లడం వంటివి చేయకూడదు.. దేవుడి వివిగ్రహాలు తాకకూడదు. గ్రహణం అంతా పూర్తయిన తర్వాత తలారా స్నానం చేయాలి. మంత్రోచ్ఛారణ ప్రయోజం కలిగిస్తుంది.దానధర్మాలు చేయడం మంచిది.

 

 

ఇక గర్బిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లకుండా తగిన విశ్రాంతి తీసుకోవాలి. దేవుడి విగ్రహాలు తాకొద్దు.గ్రహణం వీడాక స్నానం చేయాలి. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం వరకూ ఉంటుంది. ఈ సమయంలో  బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే మంచిది. ఆకాశంలో సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు వల్ల కరోనా తీవ్రత కూడా తగ్గుతుంది అని కొంత మంది నమ్ముతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: