ప్రకృతిలో మానవ జన్మ ఓ అపూర్వం.. ఇది కోట్ల జీవరాశుల్లో కొన్నింటికి మాత్రమే లభించే బ్రహ్మాండమైన వరం. కానీ మనుషులుగా పుట్టిన మనం మాత్రం దాని విశిష్టతను గుర్తించడం లేదు. మానవ జన్మ విలువ తెలుసుకోకుండా అజ్ఞానంలోనూ.. ఐహిక సుఖాల్లోనూ కొట్టుకుపోతూ.. దీని విలువను గ్రహించలేకపోతున్నాం.. 

 

IHG


మానవ జన్మను సద్వినియోగం చేసుకుంటేనే.. దానికి సార్థకత. మరి అలా సద్వినియోగం చేసుకోవాలంటే.. సత్సాంగత్యం అవసరం. మనిషి తనను తాను ఉన్నతుడిగా భావించినప్పుడే, ఉన్నత కార్యాలపై దృష్టి సారించి, ఉత్తమ లక్షణాలను అలవరచుకుంటాడు. అప్పుడే ఆదర్శవంతమైన జీవితం వైపు అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తుంది. జన్మ సార్థకత అనగానే అదేదో.. ముక్కు మూసుకుని తపస్సులాంటిది కాదు. 

 


జన్మ సార్థకత అంటే.. ముందుగా మనల్ని మనం సంస్కరించుకోవడం. ఆ తర్వాత  ఇతరులు తమన తాము సంస్కరించుకునేందుకు సహాయపడటం. అవును.. ఇదే నిజమైన ముక్తి మార్గం. మనసును అంటి పెట్టుకున్న సంకుచిత స్వార్థ స్వభావం, కపట అసూయ ద్వేషాల వంటి దుష్ట సంస్కారాలే బంధనాలుగా మారతాయి. 

 

IHG'purpose' in life ...


మీ స్నేహితులు ఎలాంటి వారో చెప్పండి.. మీరు ఎలాంటి వారో చెబుతా అంటాడో రచయిత.. అందుకే ముందు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. మన స్నేహితులను ఎంచుకోవాలి. మంచి స్నేహితులను పెంచుకోవాలి. మంచి గురువులను వెదికి పట్టుకోవాలి. వారి నుంచి అమూల్యమైన సూచనలు గ్రహించాలి. అప్పుడే మనం ఉన్నతులుగా మారేందుకు మార్గం సుగమం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: