ఎవరినైనా సంతృప్తి పరచాలంటే ఏం చేయాలి.. ఓ కానుక ఇవ్వాలి.. ఖరీదైన గిఫ్టు ఇవ్వాలి.. ఇలా ఏం చేసినా అది డబ్బుతో ముడిపడే ఉంటుంది. డబ్బు కాకపోతే మరేదైనా వస్తువు.. ఏదైనా సరే.. ఆర్థికంగా ఖర్చు చేయాల్సిందే. కానీ.. పైసా ఖర్చు చేయకుండా ఇతరులను సంతోష పెట్టే మార్గాలు కూడా ఉన్నాయి.

 

IHG're struggling - Life As I Dreamed It


అదెలా అంటారా.. అలాంటి వాటిలో ముందుండేది ఓ చిరునవ్వు.. ఓ మంచి మాట.. ఓ పలకరింత.. ఓ ఊరడింపు.. వీటిలో దేనికీ పైసా ఖర్చు కాదు.. కానీ కష్టాల్లో ఉన్నవారికి ఇవి ఇచ్చే భరోసా డబ్బుతో కూడా రానే రాదు. అందుకే ఎవరినైనా చిరునవ్వుతో పలకరించండి. ఆత్మీయంగా మాట్లాడండి.. అలాగని తెచ్చి పెట్టుకునే పలకరింపులు, చిరునవ్వులు వద్దు. 

 

IHG


హృదయపూర్వకంగా ప్రేమగా ఉండండి. ఎదుటి వారిని ప్రేమగా పలకరించండి.. బాధల్లో ఉన్నవారిని ఆత్మీయంగా అక్కున చేర్చుకోండి.. ఏమీ కాదు.. అంతా సర్దుకుంటుందని ఊరడించండి. నేనున్నాననే భరోసా కల్పించండి.. ఇంతకు మించిన బహుమతి వారి  ఆ సమయంలో వేరే ఏదీ ఉండదని గుర్తుంచుకోండి. 

 


పంట ఎంత బాగా పండినా రైతు ధాన్యాన్ని కళ్లంలో శుభ్రం చెయ్యనిదే బండ్లకెత్తడు. బలవంతుడికైనా చోదకశక్తి అవసరం. అవతార పురుషుడికైనా అమ్మలాలన, పాలన అవసరం. సిరిసంపదలెన్ని ఉన్నా సుఖశాంతులు ఆవశ్యకం. జీవితానికి సరిపడా అన్నీ ఉన్నాయన్న భరోసా, ధైర్యం మాత్రమే సరిపోవు. జీవన దశల్లో, చేపట్టే కార్యాల్లో శుభం జరగాలని కోరేవారు ఉండాలి. దీవించేవారు ఉండాలి. అందుకే ప్రేమగా దీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: