శ్లోకం: 
స్మితేన భావేన చ లజ్జయా భియా
పరాజ్ముఖై రర్థ కటాక్ష వీక్షనైః
వచో బ్భిరీర్ష్యా కలహేన లీలయా
సమస్థ భావైః ఖలు బందనం స్త్రీః

పదార్ధం  
స్మితేన = మంద స్మితమైన మోముతో (చిరునవ్వుతో) - భావేన = హావ భావాలతో (చేస్టలతో)
చ = కాకుండా - లజ్జయా = సిగ్గుతో (సిగ్గును అభినయిస్తూ) - భియా = భయం తో
పరాజ్ముఖై = అందమైన నగుమోము ను ప్రక్కకు త్రిప్పి చూపించీ చూపించ కుండా
అర్ధ = అర్ధంతో - కటాక్ష = దయగల, కరుణారసస్పూర్తిని కలిగించే - వీక్షనైః = చూపులుగలదై


భావార్ధం & వివరణ 
మందస్మిత మోము తో ప్రేమైక భావాలతో నునుసిగ్గుల తో స్వల్పభయా భినయం తో, ముఖారవిందాన్ని కొంచెం ప్రక్కకి త్రిప్పి చూపించటానికి అయిష్టత అభియనిస్తూ, కడగంటి చూపులతో, వాక్చమత్కార -చాతుర్యంతో, ఈసునసూయలు నిండిన చేష్టలతో, ప్రేమ నిండిన శ్లెషపూర్వక పలుకులతో, నవరసాభినయ హావభావాల సమ్మిళితమైన ప్రదర్శనతో పురుషుణ్ణి కట్తిపదేయటం స్త్రీలకు సులభమై విద్యే ...ఇదంతా నటనే సుమా!
 
శ్లోకం: 
భ్రూ చాతుర్యాత్ కుంచితాక్షః కటాక్షః
స్నిగ్ధా వాచో లజ్జితాంశ్చ హాసాః
లీలామందం ప్రస్థితం చ స్థితంచ
స్త్రీణా మేత ధ్భూషనం చాయుదంచ

పదార్ధం  
భ్రూ = కనుబొమలు - చాతుర్యాత్ = చతురతతో తెలివిగా - కుంచితాక్షా = చికిలించిన కన్నులతో - కటాక్షః = దేవత కరుణించినట్లు - స్నిగ్ధ = చిరునవ్వు కలబోసిన - వాచో = మాటల శ్లేషతో - లజ్జితాంస్చా = వనితల కుండే సహజ సిగ్గును మేళవిస్తూ - హాసః = పరిహాసంతో కూడిన అందమైన చిరునవ్వు = లీల + అమందం = కొంచెం చురుకైన - ప్రస్తితంచ = వెళ్ళుతూ - స్థితంచ = ఆగుతూ - స్త్రీణా = వనితలకు - అమేత = విందుచేయు - తద్ = ఆ యొక్క -భూషణం = ఆభరణం, అలంకారమైన - ఆయుదంచ = అవే ఆయుధాలు,

భావార్ధం  
కనుబొమ్మల ను చాతుర్యం గా ధనురాకారం గా వంచి, చికిలించి కించిత్ ప్రేమను ఒలక బోస్తూ అర్ధ నిమీలిత నేత్రాలు కడగంటి చూపులు మధుర భాషణలు, సుమధుర సిగ్గుదొంతరలు, ముసిముసి నవ్వులు, అందమైన అరనవ్వులు, వయ్యారి హంస నడకలు, పురుషులకు నయనానందము కలిగించే హొయలు, కలిగిఉండటమే కాదు, సమయానికి ప్రదర్శించటం స్త్రీ సహజలక్షణం. వారికి అవి ఆభరణాలేకాదు! - పురుషులపై ప్రయోగించే క్షిపణులు కూడా! వశం చేసు కునే ఆయుధాలు కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి: