సాధారణంగా ప్రతి మనిషికి పుట్టిన రోజు అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది..అయితే ఈ పుట్టిన రోజు వేడుకలు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చేస్తుంటారు. ఉన్నవారు అయితే ఆడంబరంగా చేసుకుంటే.. మద్యతరగతి వారు వారికి ఉన్నంతలో   పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారు. ఇక చిన్నతనంలో పుట్టినరోజు అంటే స్కూళ్లో పిల్లలకు చాక్లెట్స్ పంచడం కేక్ కట్ చేయడం లాంటివి చేసేవారు. ఇప్పుడు పుట్టిన రోజు ట్రెండ్ మారింది..కాస్త ఉన్నవారు అయితే బర్త్ డే వాళ్లకు ఇష్టమైన ప్రదేశాల్లో అంటే  స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ ఇలా చేస్తుంటారు.  కొందరు మంచి మనసుతో పేదవాళ్లకు తమకు ఉన్నంతలో దానం చేస్తుంటారు. అయితే పుట్టిన రోజు వేడుకకు స్నేహితులు ఇచ్చే గిఫ్ట్ చాలా ఆనందాన్ని ఇస్తాయి. కొంతమంది అయితే వాటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు.


కొంత మందికి స్నేహితులు తమ గుర్తుగా మర్చిపోలేని బహుమతులు ఇస్తారు. తాజాగా ఓ అమ్మాయి తన స్నేహితురాలికి ఇచ్చిన బహుమతి చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది..అంతే కాదు ఆ అమ్మయి సృజనకు మెచ్చుకోక తప్పదు.  భువనగిరి కి  చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని అక్షయ తన పదమూదవ పుట్టిన రోజును వినూత్నంగా  విభిన్న పద్దతిలో అందరికీ మార్గదర్శకంగ ఉండే విధంగా  జరుపుకుంది.  తన గ్రామానికి దగ్గర్లో ఉన్న భువనగిరిలో ఆరతి నిరుపేద బాలిక చెందిన ఇంటిలో మరుగు దొడ్డి నిర్మించి ఇచ్చి, వారింటిలోనేతన జన్మదిన వేడుకలను జరుపుకుంది.


ఇటీవల అక్షయ తిరుచ్చికి బస్సులో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యంలో ఓ గ్రామంలో బాలికలు మరుగుదొడ్డి వసతి లేక ఇబ్బందులకు గురవుతుండటాన్ని గమనించింది. అప్పుడే తన పుట్టినరోజుకు ఏదైనా ఓ గ్రామంలోని బాలికకు మరుగుదొడ్డిని నిర్మించి ఇవ్వాలని తీర్మానించింది. ఆ మేరకు తన బర్త్‌డే కోసం కానుకల రూపేణా తల్లిదండ్రులు, ఇతరులు ఇచ్చిన నగదుతో భువనగిరిలో  అనే బాలికకు ఆమె ఇంటిలో మరుగు దొడ్డిని నిర్మించి ఇచ్చింది.


ఆ బాలిక కుటుంబం పేదరికం కారణంగా ఇంటిలో మరుగుదొడ్డి లేక ఊరికి దూరంగా బహిర్భూమికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని అక్కడ మరుగుదొడ్డిని నిర్మించి అక్షయ తన బర్త్‌డేని వెరైటీగా జరుపుకుంది. అక్షయ చేసిన సహాయానికి ఆరతి కుటుంబీకులంతా ధన్యవాదాలు తెలుపుకున్నారు. అయితే ఈ భువనగిరి మన నల్గొండ జిల్లా భువనగిరి కాదండోయ్. తమిళనాడు రాజధాని చెన్నై కి సమీప గ్రామం ఈ భువనగిరి. చిన్న వయసులోనే అక్షయ ఔన్నత్యం ఔదార్యం మరపురానివి.

మరింత సమాచారం తెలుసుకోండి: