రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి రెబ్బలు తింటే చాలు ఎటువంటి అనారోగ్యం రాకుండా మన శరీరాన్ని రక్షిస్తుందని అంటారు.  వెల్లుల్లి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు కేన్సర్ వ్యాధిని దరిచేరనివ్వదు.  ఒక్క మాటలో చెప్పాలి అంటే మన శరీర రక్షణ శక్తిని పెంచే గుణం వెల్లుల్లికి ఉంది. 

ఈ వెల్లుల్లి వాడకం వల్ల  కాలేయాన్ని  మంచిగా  ఉంచడమే కాకుండా కీళ్ళ నోప్పులు తగ్గిస్తుంది. వెన్నలో వేయించుకుని రోజుకు ఏడు, ఎనిమిది వెల్లుల్లి పాయల్ని తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుందని అంటారు.  ఇందులో విటమిన్‌ సి, బి6, సెలీనియమ్‌, జింక్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌ వంటి పదార్ధాలు ఉన్నాయి. 

ప్రముఖ ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం హృదయ సంబంధ వ్యాధులు, కేశవృద్ధికి, ఆకలి పుట్టటానికి వెల్లుల్లి ఎంతో ఉపయోగ పడుతుంది.  అంతేకాదు ఇంచుమించు చాలామందికి వచ్చే అనారోగ్య సమస్యలు అయిన మొలలు, కడుపులో పురుగులు, ఉబ్బసం, దగ్గు మొదలైన వ్యాధులకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.  

వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది బ్యాక్టీరియను నాశనం చేస్తుంది.   అంతేకాదు ప్రస్తుతం అందరిలో సహజంగా ఉండే బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే  హైడ్రోజన్‌ సల్ఫేట్‌, నైట్రిక యాసిడ్‌, రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లిలో ఉండే ఆంజియోటిన్స్2 ఇది ప్రోటీన్ . ఇది బ్లడ్ ప్రెజర్ పెరగకుండా బ్లడ్ వెజిల్స్ ఫ్రీ చేస్తుంది. 

జర్మనీకి చెందిన డాక్టర్లు జరిపిన పరిశోధనలలో వెల్లుల్లి గుండెపోటును సమర్థవంతంగా నివారిస్తుంది అన్న విషయం బయటపడింది.  వెల్లుల్లి రక్త కణాల్లో కొలెస్ట రాల్‌ని కరిగించి రక్తం సాఫీగా సాగేట్లు సహకరిస్తుందనీ, దీనితో హైబీపీ, గుండెపోటు నివారించబడతాయనీ కోలోన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ హామ్‌‌స రాయిటర్‌ అంటున్నారు. 

థైరాయిడ్ చికిత్సకు వెల్లుల్లి చాల బాగా సహాయపడుతుంది  అంతేకాదు అలర్జీలను నివారిస్తుంది.  వెల్లుల్లిలో మూడు రేఖలను పాలలో కలిపి మరగబెట్టి రాత్రి త్రాగితే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది.  మన ఆహారంలో వెల్లుల్లిని అరుదుగా ఉపయోగిస్తుంటాం. కానీ వెల్లుల్లిని వాడటం దీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతోంది. ఈ  ప్రయోజనాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని మన ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా ఉండేడట్లు చూసుకుంటే మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి: