ప్రతిరోజు చీజ్ మన ఆహార పదార్ధాలతో కలిపి తీసుకుంటే కొన్ని అనారోగ్యాలు మటుమాయం అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ రెడింగ్ సైంటిస్టులు చీజ్ పై చేసిన పరిశోధనలో కొన్ని అద్భుత విషయాలు బయటపడ్డాయి. ఈ చీజ్ తమ ఆహారంలో ప్రతిరోజు కలిపి తీసుకునే వారికి హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశం సుమారు 14 శాతం వరకు తగ్గుతుందని అంటున్నారు.  

చీజ్‌ ను రోజూ కనీసం 40 గ్రాముల మోతాదులో తింటే దాంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి పుష్కలంగా అందుతాయి. అందులో ఉండే కాల్షియం మన శరీరంలో ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలను దృఢంగా మారుస్తుంది. చీజ్‌ ను రోజూ తింటే రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి దానివల్ల గుండె సమస్యలు రావు. 

ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఈ చీజ్ తినే వారికి చాలావరకు తగ్గుతుంది. చీజ్‌ లో ప్రొబయోటిక్స్ చాల సమృద్ధిగా ఉంటాయి. దీనితో మన శరీరం చెడు బ్యాక్టీరియా పాలిట పడకుండా రక్షణ లభిస్తుంది. చీజ్‌లో విటమిన్ బి12, జింక్, సెలీనియం, విటమిన్ ఎ, కె2, పాస్ఫరస్, రైబోఫ్లేవిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తాయి. 

అంతేకాదు మన మెదడు పనితీరును మెరుగు పరచడంలో మన జ్ఞాపకశక్తి పెంచడంలో ఈ చీజ్ ఎంతగానో సహకరిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉండే వారికి చీజ్ మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీనితో ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇవే కాకుండా చీజ్‌ లో మొత్తం 2వేల రకాలు ప్రపంచవ్యాప్తంగా మనకు లభిస్తున్నాయి. చీజ్‌ ను ఆవు, గేదె, మేక పాల నుంచి తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఒంటె, గుర్రం పాల నుంచి కూడా చీజ్‌ను తయారు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడవుతున్న చీజ్ వెరైటీ మొజరెల్లా ఈ వెరైటీని తింటే దంత సమస్యల నుంచి కూడా బయటపడి దంతాలు దృఢంగా ఉంటాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ చీజ్ ను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం ఎంతో మంచిదని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: