సామాన్యంగా చాలామంది వేరుశనక్కాయలను టైమ్‌పాస్‌ కోసం తింటారు అని అనుకుంటూ ఉంటారు. దీని పై నవ్వు వచ్చే రకరకాల జోక్స్ సామెతలు కూడ ఉన్నాయి. అయితే ఇలా తరుచు  వేరుశనగాక్కాయలు తినే చాలామందికి వారికి తెలియకుండానే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతు ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్ ఫుడ్ గా పేరుగాంచిన ఈ వేరుశనగకాయలను తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.  

 

ఈ వేరుశనగలో ఉండే విటమిన్-బి3 పోషకాలవల్ల మన మెదడు ఎప్పుడు చురుకుగా ఉండటమే కాకుండా చాల ఆరోగ్యంగా కూడ ఉంటుంది. అందువల్లనే ఈ వేరుశనగలను ఆయుర్వేద వైద్యులు బ్రెయిన్ ఫుడ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ విటమిన్ బి3 పోషకం మన మెదడులోని జ్ఞాపక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగ పడుతుంది. ఇన్ని ప్రయోజనాలు గుర్తించి కాబోలు మన జాతిపిత మహాత్మాగాంధీ గాంధీ కూడ ఎక్కువగా పచ్చి వేరుశనగలను తినేవారని ఆనాటి తరం వారు ఇప్పటికీ చెపుతూ ఉంటారు. 

 

మన మెదడులో స్రవించే సెరటోనిన్‌ అనే రసాయం వల్ల మన మూడ్స్‌ బాగుంటాయి. వేరుశనక్కాయలు తిన్నప్పుడు అందులోని ట్రిప్టోఫాన్‌ అనే అమైనోయాసిడ్‌ మెదడులోని సెరటోనిన్‌ వెలువడటానికి తోడ్పడుతుంది. దాంతో మన మూడ్స్‌ బాగుపడటంతో పాటు డిప్రెషన్‌ కూడా తగ్గుతుంది అని అనేక పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. అందుకే నిరాశలో నిస్పృహలో ఉన్నవారు టైంపాస్‌ కోసం వేరుశనక్కాయలు తింటే మూడ్స్‌ బాగుపడి డిప్రెషన్‌ దూరమవుతుంది మానసిక శాస్త్రవేత్తలు కూడ చెపుతున్నారు.

 

వేరుశనక్కాయల్లో విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్‌ చాలా ఎక్కువ. అవి గర్భవతులకు ఎంతో మేలుచేస్తాయి. అంతేకాదు ఈ వేరుశనగలలో ఉండే నియాసిన్‌ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది అన్న అధ్యనాలు కూడ ఉన్నాయి. దీనితో కాలక్షేపమే కాదు ఆరోగ్యానికి కూడ ఎంతో మేలు చేస్తాయి ఈ వేరుశనగకాయలు.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: