నువ్వుల పేరు విననివారు ఉండరు. ఇప్పటికీ మన ఇరు రాష్ట్రాలలోని పల్లె ప్రాంతాలలో నువ్వుల నూనెతో చేసిన వంటలనే ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఈ నువ్వల వాడకం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఈ నువ్వులను ఎదో ఒకరూపంలో మన ఆహార పదార్ధాలలో ఉపయోగిస్తూ ఉంటారు అన్నది వాస్తవం.

 

ఈ నువ్వులను వలన మనకు చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఇందులో చాలా రకాల  పోషకాలు ఉన్నాయి అందుకనే దీనిని ‘పవర్ హౌజ్’ అంటారు చాలా మంది. ఇందులో జింక్, థయామిన్, ఐరన్, మినరల్స్, కాల్షియం, మరియు విటమిన్ ‘E’లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. నువ్వుల నూనె వాడటం వలన చాలా తక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానటంలో కూడ ఈ నువ్వులు బాగా సహాయ పడతాయి.

 

నువ్వులలో ఉండే జింక్ ఎముకలను దృడంగా ఉండే విధంగా చేస్తుంది. ఎముకల దృఢత్వం కోసం నువ్వులు కాల్షియం, మినరల్స్ ని పుష్కలంగా అందిస్తాయి నువ్వులు ఫైబర్ ను కలిగి ఉంటాయి. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. ఈ నువ్వులలో ఉండే పోషకాల వలన వయసు పెరిగినా అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది.

 

నువ్వుల విత్తనాలనుండి తీసిన నూనెలో శక్తి వంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఎంతోమంది బాధ పడుతున్న గ్యాస్ ట్రబుల్ కు కూడ ఈ నువ్వులు బాగా పనిచేస్తాయి. ఇకపోతే ఈ నువ్వుల వలన మనకు జీర్ణ శక్తీ వృద్ధి కావడమే కాకుండా ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా డయాబిటీస్ సమస్యలకు కూడ ఈనువ్వులు ఎంతగానో మేలు చేస్తాయి. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ నువ్వులను మనం రోజు తీసుకునే ఆహార పదార్ధాలలో సరైన మోతాదులో తీసుకోగలిగితే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరికినట్లే..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: