ఎడారి ప్రాంతాల్లో విరివిగా దొరికే  ఖర్జూరం ప్ర‌స్తుతం ఎప్పుడుపడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకుతూనే ఉంటుంది. ఇతర పండ్లతో పోలిస్తే ఈఖర్జూరం పళ్ళు తక్కువ ధరకే ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. దీనితో మనం నిత్యం మన ఆహారంలో వీటిని భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనితో ఈఖర్జూరం వాళ్ళ కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఎవరు ఈ పదును వదులుకోరు. సెలీనియం, మెగ్నిషియం, కాపర్ వంటి మూలకాలతోపాటు ఖర్జూరాల్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది.  

 

దీనికితోడు కేవలం కొన్ని ఖర్జూరాలను తింటేచాలు మన పొట్ట నిండిన భావన కలుగుతుంది కాబట్టి ఇది మన శరీర బరువు తగ్గేందుకు ఎంతగానే ఉపయోగపడుతుంది. ఈఖరూర్జాలను నిత్యం తగిన మోతాదులో తీసుకుంటే కడుపులో పేగుల కదలికలు సవ్యంగా ఉండి  మన జీర్ణక్రియ బాగా ఉండటంలో ఈ ఖర్జూరాలు ఎంతగానో సహకరిస్తాయి.


అంతేకాదు వీటివల్ల మన  శరీరంలో మంచి బాక్టీరియా స్థాయిని ఇవి పెంచుతాయి. అదే సమయంలో చెడ్డ బాక్టీరియాలను ఈ ఖర్జూరాలు తగ్గిస్తాయి. దీనికితోడు  కొవ్వులు, ట్రాన్స్‌ ఫ్యాట్‌ లు వీటిలో ఉందని నేపధ్యంలో మన గుండెను ఆరోగ్యకరంగా ఉంచడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.  దీనికితోడు అందరికీ సర్వసాధారణంగా వచ్చే గొంతునొప్పి జలుబు వంటి సమస్యలు రాకుండా ఈఖర్జూరం ఎంతగానో పనిచేస్తుంది.

 

దీనితో అను నిత్యం తగిన‌న్ని ఖర్జూరాలు తింటే ఎముకలు బలంగా ఉంటాయి అని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. మన శరీరంలోని ఐరన్ రక్తహీనతను నివారించడంలో ఈ ఖర్జురానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన అనేక మంది వైద్యులు తప్పనిసరిగా ఈ ఖర్జూరాన్ని ప్రతిరోజు తినడం మంచిది అని తెలియచేస్తున్నారు. దీనితో ఆరోగ్యవంతమైన జీవితం కోసం ఈఖర్జురాలను ఎంతవీలు అయితే అంత తీసుకోవడం మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి: