సరిగ్గా నమలకుండా భోజనం చేసేవారికి మసాలాలు కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునే వారికీ  క‌డుపులో మంట‌, గ్యాస్ వ‌స్తాయి. అంతేకాకుండా ధూమపానం మద్యపానం అధిక బరువు సమయానికి భోజనం చేయకపోవడం లాంటివి కూడా అసిడిటీ కడుపులో గ్యాస్ సమస్యలకు కారణం అని వైద్యులు చెపుతున్నారు. అయితే కొన్ని సహజ సిద్ధమైన టిప్స్ తో ఇలాంటి సమస్యల నుండి మనం బయట పడవచ్చు.

 


ప్రతిరోజూ ఒక అరటిపండు తీసుకుంటే అసిడిటీ గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా యాపిల్ జ్యూస్ వల్ల కూడ గ్యాస్ సమస్యలు నివారణ అవుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు క్యాబేజీ ముల్లంగి వెల్లుల్లి వంటి పచ్చి కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ను తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది. 


అంతేకాకుండా భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. దీనివలన పొట్టలో గ్యాస్ చేరేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా త్రాగే వారికి అసిడిటీ సమస్య ఉండదు అని వైద్యులు చెపుతున్నారు. ముఖ్యంగా తులసి ఆకులను నిత్యం చప్పరిస్తే గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి అని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.

 

వీతితోపాటు పుచ్చకాయ కీర దోసకాయలను తీసుకుంటే గ్యాస్ త్వరగా మాయమవుతుంది. భోజనం చేసిన తరువాత పుదీనా రసం తీసుకునే వారిలో కూడ అసిడిటీ, గ్యాస్ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. దీనితో ఈ టిప్స్ ను వీలైనంత వరకు పాటించిన వారికి గ్యాస్ సమస్యలు కడుపులో మంటల సమస్యలు ఉండవు. అని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: