ప్రస్తుత కాలమాన పరిస్థుతులలో పోటీ వాతావరణం పెరిగి పోవడంతో ప్రతి వ్యక్తిలోనూ ఒత్తిడి, ఆందోళ‌న‌ పెరిగి పోతోంది. ఈ తీవ్రమైన ఒత్తిడి వల్ల చాలామంది డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్తుతులను ఎదిరించి మానసిక ఒత్తిడిలను తట్టుకోవడంలో మనం ప్రతిరోజు తీసుకునే ఆహారపు అలవాట్లు కూడ కీలకపాత్ర పోషిస్తాయి అని అధ్యయనాలు చెపుతున్నాయి.

మన మైండ్ ను నియంత్రిస్తూ మనస్సుని ఉల్లాసంగా ఉంచడంలో సెరటోనిన్ అనే పదార్థం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మెదడులో న్యూరో ట్రాన్స్‌ మీటర్‌గా పనిచేస్తుంది. పాలు, చేమ దుంపలు, చేమకూర, జీడిపప్పులను తింటే సెరటోనిన్ ఎక్కువగా లభిస్తుంది. దీని ద్వారా మనస్సును ఉత్తేజంగా ఉంచుకోవచ్చు. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 


అదేవిధంగా తాజా కూరగాయలు తింటే మన మూడ్ ఆటోమేటిక్‌గా మారిపోయి ఒత్తిడి లేకుండా ఉండ‌వ‌చ్చు అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. దీనికితోడు మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు తింటే మెదడులోని నాడీ కణాలు ఉత్తేజంగా ఉంటాయి. బాదం పప్పు, వేరుశెన‌గ‌లు, చిలగడదుంపలు, అరటికాయల్లో పొటాషియం బాగా ఉంటుంది. ఇవి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ‌న తగ్గి  ఉల్లాసంగా ఉంటారని వైద్యులు చెపుతున్నారు.

 

అదేవిధంగా ఆకుకూరలు, చేపలు, అవిసె గింజలు తీసుకుంటే మానసిక ఏకాగ్రత విశ్రాంతి కలుపుగోలుతనం పెరుగుతాయి. గుండె కూడా ఆరోగ్యంగా డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. దీనితో డిప్రెషన్ సమస్యతో మానసిక వైద్యుల చుట్టూ తిరిగే దానికన్నా ఇలాంటి ఆహార పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకుంటే అన్నివిధాల మంచిది..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: