మష్రూమ్స్‌ అంటూ పిలవబడే పుట్టగొడుగుల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తరుచూ ఆహారంగా తీసుకునే వారికి  వృద్ధాప్యం దరికి చేరదు అని అధ్యయనాలు చెపుతున్నాయి. పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల వృద్దాప్య ఛాయలు మన శరీరంలో కనిపించవు. 

మనం తీసుకున్న ఆహారం ఆక్సీకరణకు గురైనప్పుడు హానికారక ఫ్రీరాడికల్స్ శరీరంలోకి విడుదలవుతాయి. ఇవి శరీర కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా క్యాన్సర్ గుండె సంబంధ సమస్యలు అల్జీమర్స్ వంటి వ్యాధులు సంభవిస్తాయి. చివరకు డీఎన్‌ఏపై కూడా ఇవి ప్రభావం చూపి వృద్ధాప్యానికి కారణమవుతాయి. అయితే పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్ గ్లుటాథియోన్ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ ఎక్కువ విడుదల కాకుండా అడ్డుకోవడంతో మన శరీరంలో ముడతలు ఏర్పడవు.

ముఖ్యంగా వేసవికాలంలో పుట్టగొడుగులను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మ సౌందర్యం పెరిగి చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వీటిల్లో బలవర్థక విటమిన్లకు కొరత లేదు. పుట్టగొడుగుల్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో డి విటమిన్‌ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు ఎలర్జీలు దరి చేరవు. 

పుట్టగొడుగులు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ గుణాన్ని కలిగి ఉండటంతో పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రైటింగ్‌ గుణాలున్నాయి. అందువల్ల చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. వీటిల్లో ఫ్యాట్‌ కొలెస్ట్రాల్‌ కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉండటంతో గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరం కావడమే కాకుండా రొమ్ము ప్రొస్టేట్‌ కాన్సర్లను అరికట్టడంలో ఇవి శక్తివంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఇది మంచి డైట్. వీటిలో పుట్టగొడుగుల్లో కాల్షియం ఎక్కువగా ఉండటంతో పాటు సహజసిద్ధమైన యాంటిబయోటిక్స్‌ ఉండటంతో మన శరీరం ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న వీటిని మనం తరుచు ఎదో రూపంలో ఆహారంలో తీసుకోవడం మంచిదని వైద్యులు సలహాలు ఇస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: