మనం అను నిత్యం వంట‌లలో వాడే ఉప్పులో అయొడిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీర ఆరోగ్యానికి అంత మంచిదికాదు అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. దీనితో కొందరు ఈ అయోడిన్ ఉప్పుకు బదులు వంటలలో సముద్రపు ఉప్పును వాడుతున్నారు. అయితే వీటన్నిటికంటే హిమాలయ ఉప్పు అత్యంత ఆరోగ్యప్రదం అని పరిశోధనలు చెపుతున్నాయి. 
Pink Himalayan Salt
ప్రస్తుతం మార్కెట్లో ఈ హిమాలయ ఉప్పు లభిస్తున్న నేపధ్యంలో దీనిని ఉపయోగించుకోవడం మంచిది అని వైద్యులు కూడ చెపుతున్నారు. ఈ హిమాలయ ఉప్పు హిమాల‌యాల్లో సేక‌రించిన ఉప్పు కావడంతో ఇది మ‌నం వాడే సాధార‌ణ ఉప్పు క‌న్నా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే 84 సూక్ష్మ పోష‌కాలు ఉంటాయి. 

హిమాల‌య‌ ఉప్పులో స‌హ‌జ సిద్ధ‌మైన అయోడిన్ ఉంటుంది. ఇది మ‌న‌కు ఎంత‌గానో అవ‌స‌రం. థైరాయిడ్‌, గొంతు సంబంధ వ్యాధులు రాకుండా ఉండేందుకు అయోడిన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. కానీ మ‌నం వాడే ఉప్పులో కృత్రిమంగా అయోడిన్ క‌లుపుతారు క‌నుక ఇది అంత మంచిది కాదు. ఈ హిమాలయ  ఉప్పును నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దానివల్ల శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. త‌ద్వారా ద్ర‌వాలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. శ‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది అని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. ఈ ఉప్పులో సహజ సిద్ధ‌మైన ఆల్క‌లైన్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో గ్యాస్, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా ఉంటాయి. 
The Spice Lab Himalayan Salt Inhaler - Refill for Ceramic Inhaler - Health and Mineral Fortified - 150 Grams
అంతేకాకుండా మన శరీర కండ‌రాలు ప‌ట్టేయ‌కుండా ఉండి మన శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. ఈ ఉప్పు వాడకం వల్ల బీపీ నియంత్ర‌ణ‌లో ఉండటమే కాకుండా ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుపడి గుండె సంబంధిత  స‌మ‌స్య‌లు రావు. అదేవిధంగా మనం ఒక టీస్పూన్ సాల్ట్ ను వాడే బదులు అందులో 1/4 వంటలలో వాడితే ఈ ఫలితాలు అన్నీ వస్తాయని లేటెస్ట్ అధ్యయనాలు చెపుతున్నాయి. దీనితో ఈ హిమాలయ ఉప్పును వాడటం అలవాటం చేసుకోవడం ఆరోగ్యానికి అన్నివిధాల శ్రేయస్కరం..   


మరింత సమాచారం తెలుసుకోండి: