రాఖీ పండుగ అత్మీయ‌త‌కు ప్ర‌తీక గా నిలుస్తూ వ‌స్తుంది. సోద‌రి సోదరులకు ప్రేమానురాగాల‌ను ప్ర‌తి రూపంగా నిలుస్తోంది. సోద‌రి త‌న సోద‌రుడికి పూర్తి సంవ‌త్స‌రం విజ‌యం చేకూరాల‌ని రాఖీ క‌డుతుంది. రాఖీ  క‌ట్టిన సోద‌రికి  జీవితాంతం ర‌క్షగా ఉంటాన‌ని సోదరుడు భావించే పండుగ‌. ఈ రోజున సోద‌రి, సోద‌రుడికి రంగు రంగుల రాఖీని క‌డుతుంది.  

Image result for rakhi festival

హిందు సాంప్ర దాయం ప్ర‌కారం, శ్రావ‌ణ మాసంలో(జూలై అగ‌ష్ణు మ‌ధ్య‌లో) రాఖీ పౌర్ణ‌మి జ‌రుపుకుంటారు. ఉత్తర భార‌తదేశంలో రాఖీ పౌర్ణ‌మిని ర‌క్షా బంధ‌న్ గా పిలుస్తుంటారు. వాస్త‌వానికి భార‌తదేశంలో రాఖీ పౌర్ణ‌మి ఎప్పుడు ప్రారంభ‌మైందో,  ఎలా ప్రారంభ‌మైందో తెలిపే నిర్థిష్ట సాక్ష్య‌దారాలు లేవు. పుర‌ణాల్లో రాఖీ పౌర్ణ‌మి పై వివిధ ర‌కాలుగా క‌థ‌నాలు మాత్రం ఉన్నాయి.  


ఎడిటోరియ‌ల్: రాఖీ పౌర్ణ‌మి గురించి చ‌రిత్ర ఏం చెబుతుందంటే...!

చ‌రిత్ర రాసిన ప్ర‌కారం ఒక్క సారి గ‌మ‌నిస్తే... ద్రౌప‌ది, శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా క‌నిపిస్తుంది. శిశుపాలుడిని  శిక్షించే క్ర‌మంలో సుద‌ర్శ‌న చ‌క్రాన్ని ప్ర‌యోగించిన కృష్ణుని చూపుడు వేలుకు ర‌క్తం ధార‌గా కారుతుంద‌ట‌. ఈ ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన శ్రీకృష్ణుడి  చెల్లెలు ద్రౌప‌ది త‌న ప‌ట్టు చీర కొంగు చింపి వేలికి క‌ట్టు క‌ట్టింద‌ట‌. 

ఎడిటోరియ‌ల్: రాఖీ పౌర్ణ‌మి గురించి చ‌రిత్ర ఏం చెబుతుందంటే...!
ఇందు కు కృతజ్ఞ‌త‌గా ఎల్లవేళ్ల‌లా అండ‌గా ఉంటాన‌ని,  ఏ స‌మ‌స్య ఏదురైన ఆదుకుంటాన‌ని శ్రీకృష్ణుడు ద్రౌప‌ది కి హామీ నిస్తాడు.  ఇదీలా ఉంటే చ‌రిత్ర‌లో రాఖీపై మ‌రో క‌థ‌నం కూడా ఉంది. అలెగ్జాండ‌ర్ భార్య రోక్సానా త‌క్ష శిల రాజు పురుషోత్త‌ముడిని తన సోద‌రుడిగా భావించి రాఖీ క‌డుతుంది. జ‌గ‌జ్జెత‌గా మారాల‌నే త‌ప‌న‌తో గ్రీకు యువ‌రాజు అలెగ్జాండ‌ర్ క్రీస్తు పూర్వం 326 లో భార‌తదేశంపై దండెత్తు తాడు. 

ఎడిటోరియ‌ల్: రాఖీ పౌర్ణ‌మి గురించి చ‌రిత్ర ఏం చెబుతుందంటే...!
ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్‌)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసు కుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చి నాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని తన భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ యుద్ధం విరమించుకుంటాడు.


ఎడిటోరియ‌ల్: రాఖీ పౌర్ణ‌మి గురించి చ‌రిత్ర ఏం చెబుతుందంటే...!

ఇలా చ‌రిత్ర‌లో ఉన్న క‌థ‌నాల‌ను బ‌ట్టి చూస్తే  నాటి నుంచే సోద‌రి సోదరుల అనుబంధాన్నే గుర్తు చేస్తూ వ‌స్తుం డ‌టంతో ఈ పండుగ ప్ర‌త్యేకంగా అన్నా, చెల్లెలు, అన్న‌, త‌మ్ముళ్ల అనుంబంధానికి ప్ర‌తిక గా నిలుస్తోంది. ఎక్క‌డ‌, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ రోజు సోద‌రి సోద‌రులు క‌లుసుకునేలా వ‌స్తున్న ఈ పండుగ ఎంతో ప్రావీణ్యం  పొందింది



మరింత సమాచారం తెలుసుకోండి: