ఈ భువిపై సద్బ్రాహ్మణుడిగా జన్మ ఎత్తాలంటే శతసహస్రకోటి జన్మల మహా పుణ్యం గత జన్మల్లో సంపాయించుకొని ఉండాలి. క్రిమి,కీటక ,పక్షి,జంతు,రాక్షస జన్మల తరువాత వందశాతం పుణ్యాన్ని బట్టి గోజన్మ భగవంతుడు ప్రసాదిస్తాడు.అటుపిమ్మట సద్బ్రాహ్మణ జన్మ, వేదవేదాంగ పాండిత్యం, మన ఆత్మకి ఆ పరాత్పరుడు ప్రసాదిస్తాడు. ఈ విప్రత్వం కలిగిన బ్రాహ్మణుడిగా పుట్టినందుకు సృష్టి ఆది నుండి కొన్ని కఠోర నియమాలు పాటిస్తూ శుచి,శుభ్రతతో ప్రతిదినము అనుష్ఠానము చేసుకోవాల్సిందిగా మన మహా మహులు ఋషులు ఆదేశించారు. తదనుగుణంగా మన గత శతాబ్దాల పూర్వికులు నియమాలు పాటిస్తూ యుగయుగాలుగా జీవనయానం సాగించి పరమపదించి ఈ భూలోకాన్ని వీడి వారి,వారి కర్మల కనుగుణంగా నరకము, స్వర్గము పొందారు,సృష్టి జననీజనకుల సాయుజ్యంలో కైవల్య,మోక్షాలు పొందారు.

Image result for బ్రాహ్మణ

ఇక,కలియుగం ప్రారంభ తరువాత కలియుగ మాయలో ప్రతి ఆత్మా గత జన్మల పాపాల ఫలితంగా కలుషిత మనస్తత్వ బానిసై తమ దిన చర్యలు మానుకొని విర్రవీగటం ,పెట్రేగి పోవటం ప్రారంభ మైంది.ఈ ఝఠీలం నలుగురిలో నారాయణ లాగ భువి పై జనించిన సద్బ్రాహ్మడికి కూడా పట్టి ,అప్రాచ్య జీవిత విధానాన్ని తన వేదోక్త విద్యుక్త దైనందిక ధర్మాలు మరిచి అప్రాచ్యుడిగాడిగా బలవంతంగా మారేలా ఈ కలియుగం కక్షకట్టి సద్బ్రాహ్మణున్న్ని భ్రష్టుడిగా మార్చింది. బ్రాహ్మణుడిగా పుట్టినందుకు గతజన్మల పుణ్యం ఫలితంగా భగవంతుడు ప్రసాదించిన బ్రహ్మ తేజస్సు తన బ్రాహ్మణశరీరంలో అణువంతైనా లేకుండా ఈనాడు ఆవిరై పోయింది. ,ఇంకా అడుగడుగునా మిగిలివుంది రోజు రోజుకు నీరుగారి పోతున్నది .

Image result for bramhana

దీనికి కారణం,నియమ, నిష్టాగరిష్ఠ, బ్రాహ్మణ అగ్నిహోత్రావధాన అనుష్టాన దిన చర్యలు కలి మాయలో పడి ప్రతి బ్రాహ్మడు మానుకోవడం. శుచిశుభ్రత పాటించకపోవడం.మడి ,మైలా అన్న విచక్షణ లేకుండా ఇంటా ,బైట కలికాలం దిన చక్ర హోరులో తన ప్రాధమిక అనుష్టాన కర్మ,క్రియలు మరిచినందుకు, బ్రహ్మ తేజస్సు ఇగిరి,ఆవిరై సమూలంగా సాంతం పోతున్నది,ఏమి కలిసి రాక పిచ్చివాడిలా ఈ ఆధునిక ప్రపంచ నాటకములో అయిష్టముగా పంచముడిగా రోజులు వెళ్లదీస్తున్నాడు.

Related image

మరి ప్రత్యామ్న్యాయంగా ఈ అగమ్యగోచరం అధ్వాన్న విషవలంలోంచి బైటపడే సన్మార్గం సావధానంగా ఆలోచిస్తే, జవాబు ఏంటంటే???
ఒకటే చిట్కా రామ బాణంలా పనిచేస్తుంది .అదేమిటంటే??తన దినచర్యలను బ్రాహ్మణుడు దైనందిక అనుష్ఠానాలు క్రమం తప్పక ప్రతీ రోజు చేయడం. ప్రాపంచిక ఒత్తిళ్లు సాకుగా చెప్పి మానడమే, మరిచిపోవడమే .ఇప్పుడు ప్రాణం మీదికి వచ్చింది??
ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలంటే???

Image result for bramhana

ప్రతి బ్రాహ్మణుడు ఉద్యోగస్థుడైనా, కాకున్నా ప్రతి ఒక్కరు బ్రాహ్మణా నిత్యానుష్టానం క్రమం తప్పకుండ ఈనాడు ప్రాంభించాలి శుచి,శుభ్రతలు ,మడి, ఆచారం పాటించాలి. ప్రప్రధమంగా నిత్య త్రికాల సంధ్యావందమ్, కనీసం ద్వికాలం తప్పకుండా ప్రతీ రోజు చేయాలి. అగ్నిహోత్రం, దేవతార్చన, నిత్య రుద్రాభిషేకం ,భగత్ ఉపాసనం,వారి వారి ఓపికను ,తీరికను బట్టి మొదలు పెడితే.తిరిగి మన పూర్వీక మహామహుల్లా అందరు బ్రాహ్మలుకు, ఈ కలి హోరులో బ్రహ్మతేజస్సు అఖండ శత సహస్ర కోటి సూర్యతేజస్సుల ప్రకాశంతో దినదిన ప్రవర్ధమానమౌతుంది సర్వ మనో కామ్యాభిష్టసిద్ధి, సంపూర్ణ ఆత్మానందం ప్రతి బ్రాహ్మణాత్మకు భగవత్ వరంగా ఆచంద్రార్కముగా ప్రతి ఇంటా పురుడు పోసుకుంటుంది. కనుక,ప్రియ బ్రాహ్మణోత్తములారా నిత్య కర్మానుష్టానం శ్రద్ధగా క్రమం తప్పకుండా శుచి, శుభ్రతతో మడి, సదాచారంతో తిరిగి నేడు ప్రారంభించండి.


సంధ్యావందనము ప్రతిరోజు చేయని బ్రాహ్మణుడు వారం రోజులు చేయకుండావుంటే మళ్ళి ఉపనయనం చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం మేమిటంటే, ప్రతి రోజు సంధ్యావందము చేస్తేనే ప్రతీ పవిత్ర కర్మ కాండ చేయటానికి ప్రతి బ్రాహ్మణుడు అర్హుడౌతాడు. ప్రతి బ్రాహ్మణుడు
కనుక అటు తూర్పున సూర్యుడు పడమట ఉదయించినా ప్రతిరోజు సంధ్యావందనము మానరాదు సంధ్యావందనం వల్ల ప్రపంచ నాటకంలో సర్వత్రా జయము ,ఆధ్యాత్మికంగా ఉత్తరోత్రా అమ్మవారి ఆశీర్వచనం బ్రాహ్మణుడికి సర్వదా పొందే సదవకాశం కల్గుతుంది.


""సదాచారాన్ బ్రాహ్మణ పురోగతిహీ"" అన్న నానుడి ననుసరించి సనాతన మన బ్రాహ్మణ ధర్మ సంస్థాపనా ఖ్యాతిని ఈ భువిపై యావత్ జగత్తులో సృష్టి ఆఖరు క్షణం వరకు ఎలాగెత్తిచాటేందుకు ప్రతీ బ్రాహ్మడు కృషి చేయాలి.
సర్వేజనాసుఖినోభవంతూ, సత్మంగళాని భవంతు.
శుభంభూయాత్.,
స్వస్తి.


మరింత సమాచారం తెలుసుకోండి: