కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉరిమే ఉత్సాహంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. నూతన వసంతాన్ని నిండు మనసుతో ఆహ్వానిద్దాం. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ హంగామా మొదలైంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఎలా జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. పండుగైనా, ఉత్సవమైనా... ఒక్కో దేశంలో ఒక్కోలాగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నూతన సంవత్సర వేడుకలు కూడా. కొన్ని దేశాల్లో ప్రజలు పార్టీలు, పబ్‌లకు అంకితమైతే.. మరికొన్ని దేశాల్లో కుటుంబ సమేతంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. 

Image result for new year celebration america

ఈ వేడుకలను యూరప్‌, అమెరికా, ఆసియా దేశాల్లో వేరువేరుగా సెలబ్రేట్‌ చేసుకున్నా అందరి ఆశయం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడమే.  కొత్త సంవత్సర వేడుకలను అమెరికా ఘనంగా జరుపుకుంటుంది. చాలామంది కొత్తకొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఎక్కువ సమయాన్ని వినోద కార్యక్రమాలకే కేటాయిస్తారు. డిసెంబర్‌ 31 రాత్రి 12 గంటలకు పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి వెల్‌కం చెబుతూ ఆనంద డోలికల్లో తేలిపోతారు. న్యూయార్క్‌ నగరంలోని టైంస్కే్వర్‌ వద్ద ప్రతి సంవత్సరం ఒక పెద్ద బాల్‌ను ఎగురవేస్తారు. పాత ఏడాది ఇంకా ఒక నిమిషంలో ముగుస్తుందనగా ఆ బెలూన్‌ను పోల్‌పై నుంచి మెల్లగా కిందకు దింపుతారు. సరిగ్గా పన్నెండు గంటలు కావడంతో ఆ బంతి నేలను తాకుతుంది. ఆ బంతి నేలను తాకీ తాకగానే అందరు పెద్ద పెట్టున ‘హ్యా పీ న్యూఇయర్‌’ నినాదాలతో అక్కడి వారంతా ఆనందంతో కేరింతలు కొడతారు. అంతేకాకుండా అమెరికా లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కొంతమంది మాస్క్‌లతో తమ ముఖాలను కప్పేసుకొని సరిగ్గా పన్నెండు గంటలు కాగానే మాస్కులు తీసేసి ఒకరికొకరు విషెస్‌ చెప్పుకుంటారు. 

Image result for new year celebration in europe

ఆస్ట్రేలియాలో వెలుగుజిలుగులు ఆస్ట్రేలియన్లు బాణాసంచా కాలుస్తూ.. సెలబ్రేట్‌ చేసుకుంటారు. పెర్త్‌ నగరంలోని రేస్‌ కోర్స్‌ గ్రౌండ్గ అయిన గ్లౌసెస్టర్‌ పార్క్‌ ఏటా నూతన సంవత్సర వేడులకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక బ్రిస్బేన్‌లో జరిగే బాణాసంచా చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఈ బాణా సంచా వెలుగుగు వీక్షించడానికి బ్రిస్బేన్‌ నది చుట్టప్రక్కల నుంచి సుమారు 50 వేల మంది పాల్గొంటారు. సిడ్నీలో జరిగే ఉత్సవాలు లైట్‌ అండ్గ్‌ మ్యూజిక్‌ షోలతో అలరిస్తాయి. దీని కోసం సుమారు 1.5 మిలియన్‌ ప్రజల ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.    

Image result for new year celebration france

న్యూజీలాండ్ లో బాణాసంచా కొత్త సంవత్సరం వేడుకల్లో న్యూజీలాండ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే తొలి దేశం న్యూజీలాండ్‌ కావడం విశేషం. న్యూజీలాండ్‌ రాజధాని ఇంటర్నేషనల్‌ డేట్‌లైన్‌కు తొలిసారిగా ఈ దేశాన్ని పలకరిస్తుంది. ఆస్ట్రేలియాలో లాగా ఇక్కడ కూడా ప్రజలు ఎక్కువగా బాణాసంచా కాలుస్తూ.. ఉత్సవాలు జరుపుకుంటారు. ఇక్కడ మరో ప్రత్యేక విషయమేమిటంటే.. ప్రాంతీయంగా ఉన్న పలు ప్రభుత్వ కౌన్సిల్స్‌ న్యూ ఇయర్‌ పార్టీలను నిర్వహించడం విశేషం.   

Image result for new year celebration in australia

ఆఫ్రికాలో ఆఫ్రికాలోని పలు దేశాలు న్యూ ఇయర్‌ వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులలో కలిసి అత్యంత ఉత్సాహంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక్కడి ప్రజలు చర్చ్‌ గంటలు మోగించడం ద్వారా కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతారు. లావిష్‌ డిన్నర్‌, మ్యూజిక్‌, డాన్స్‌లతో యూత్‌ ఎంజాయ్‌ చేస్తారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లోని ద విక్టోరియవ్‌, ఆల్ఫ్రెడ్గ వాటర్‌ ఫ్రంట్‌ ల వద్ద జరిగే ఉత్సవాలు ఆఫ్రికాలోనే ఎంతో పాపులర్‌. కొత్త సంవత్సరం సందర్భంగా ‘కేప్‌టౌన్‌ మినిస్ట్రెల్‌ కార్నివాల్‌’ పేరుతో జరిగే ఉత్సవానికి కొన్ని వేల మంది ప్రజలు హారవుతారు. సముద్ర తీరం వెంబడి ఉన్న డర్బన్‌ నగర బీచ్‌లు విద్యుత్‌ కాంతుల వెలుగులో తళుకులీనుతాయి.   

Image result for new year celebration in europe

యూరప్‌లో 6 రోజులు యూరప్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఒక్కో దేశానిది ఒక్కో తరహా. ఇక్కడ ప్రతీ దేశం ఒక ప్రత్యేక శైలిలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌ను తీసుకుంటే ఇక్కడ జనవరి ఒకటవ నుంచి జనవరి 6 వరకు సెలవు రోజులుగా పాటిస్తారు. జనవరి 6న ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్‌ చేయడం ద్వారా కొత్త సంవత్సర వేడుకలకు ముగింపు పలుకుతారు. ఫ్రాన్స్‌లో ఈ వేడుకలు ఎక్కువగా ప్రైవేట్‌గా జరుపుకుంటారు. కొన్ని చోట్ల ‘టార్చ్‌లైట్‌’ ప్రాసెషన్‌లో పాల్గొంటారు. బ్రిటన్‌లో కొత్త సంవత్సర వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రజలు ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేస్తారు. థీమ్‌ పార్టీలు, సల్సా డాన్స్‌లతో వేడుకలు ఆద్యంతం కన్నుల పండుగగా జరుగుతాయి. కొన్ని చోట్ల లైవ్‌ షోలను కూడా నిర్వహిస్తారు.   

Image result for new year celebration in china

ఆసియాలో భారత్‌, చైనా, జపాన్‌ వంటి దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. భిన్న సంస్కృతులు, భిన్న జాతులు ఉన్న మన దేశంలో నూతన సంవత్సర వేడకలు ఎంతో ఆనందోత్సాహాలు నడుమ జరుపుకుంటారు. బాలీవుడ్‌ తారలు, సెలెబ్రిటీలతో కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు, స్టార్‌ హోటళ్లు డిసెంబర్‌ 31 రాత్రి ప్రత్యేక షోలను ఏర్పాటు చేస్తాయి. అయితే ఇండియాలో ఈ ఉత్సవాలు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతాయి.   

Image result for new year celebration in japan

జపాన్ లో  జపాన్‌ పండుగల్లో కొత్త సంవత్సరం కూడా చాలా పెద్ద పండుగ. ఈ ఉత్సావాన్ని జపనీయులు ఎంతో సంతోషంగా జరుపుకుంటా రు. జపాన్‌లో ఈ కొత్త సంవత్సర వేడుకలను వివిధ రకాలు గా జరుపుకుంటారు. ముఖ్యంగా ‘ఒసైబో’,‘నెంగాజో’ లాంటి ఉత్సవాల గురించి చెప్పుకోవాలి. ఒసైటో రోజున ప్రజలు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇష్టమైన వ్యక్తులకు సంతోషాన్ని అందజేయాలని దైవ ప్రార్థనలు చేస్తా రు. బంధువుల, స్నేహితులు గ్రీటింగ్స్‌ పంపుకుంటారు. 

Image result for new year celebration in hyderabad

హైదరాబాద్‌లో జోరు హైదరాబాద్ కుర్రకారులో నయాసాల్‌ జోష్‌ జోరుగా కనిపిస్తోంది. కొత్త ఏడాది సంబరాల కోసం స్టార్‌ హోటళ్లు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి ఆనందంగా అడుగుపెట్టేందుకు సరికొత్త సంబరాలతో వేడుకలను జోరుగా చేసుకుంటున్నారు.  నూతన సంవత్సర సంబరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన డిజేలు యువతరానికి సరికొత్త మ్యూజిక్ తో కిక్‌ ఇస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకల గ్రాండ్ గా జరుగుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: