images of joyful people కోసం చిత్ర ఫలితం

 “మధు క్షీర సమాయుక్తం సర్వ వ్యాధి నివారణం”


పాలు మ‌న‌కు సంపూర్ణ పౌష్టికాహారం. పాలతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి.  శ‌రీర  నిర్మాణానికి ఆ పోష‌కాలు దోహదం చేస్తాయి. ఇక తేనె లో యాంటీ ఆక్సిడెంట్‌,  యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ ఇన్‌-ఫ్లామాటరీ గుణాలు ఉండ‌డం వ‌ల్ల మ‌న‌కు తేనె తో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా అంతరిస్తాయి. ఇక రెండింటినీ క‌లిపి తాగితే అనేక ఆరోగ్య మానసిక ప్రయోజనాలు కలుగుతాయనేదే తెలుసుకుందాం.


యాంటీ మైక్రోబియల్ గుణాలు

అన్నవాహిక పరిశుభ్రత

శక్తి స్థాయుల సమతౌల్యత

సహజ కాల్షియం నిల్వల నియంత్రణ

సుఖ నిద్ర


రోగ నిరోధక శక్తి పెంపు

వృద్ధాప్యం సుదూరం

సౌందర్య పోషణ 

మానసిక ప్రశాంతత

చురుకుదనంతో శుభోదయం

 cheerful boy and girl కోసం చిత్ర ఫలితం

1. పాలు తేనే మిశ్రమంలో “యాంటీ మైక్రోబియల్” గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతూ, మృదుత్వాన్ని చేకూరుస్తాయి . మచ్చలు, మొటిమలు తొలగిపోయి నునుపుదనాన్ని కలిగిస్తూ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. మృదువైన శిరోజాలు, అంటే కాస్మోటిక్ గుణాలు మధుర అధరాలు  ఈ మిశ్రమం స్వంతం అన్నమాట.

 beautiful sleep కోసం చిత్ర ఫలితం

2. పాలు తేనే మిశ్రమం సేవించటం ద్వారా - అన్నవాహిక, జీర్ణాశయం, పేగుల్లో లలో ఉండే హానికారక బాక్టీరియా అంతమౌతుంది.  మేలు చేసే బాక్టీరియా వృద్ధిచెంది సాధారణ జీర్ణ సమస్యలైన గ్యాస్,  అసిడిటీ, మలబద్దకం వంటివి దరిచేరవు.

milk and honey mixture కోసం చిత్ర ఫలితం 

3. పాలు తేనే మిశ్రమం సేవించటం ద్వారా  - శరీర జీవక్రియ అంటే మెటబాలిజం వృద్ధిచెంది దేహానికి శక్తి త్వరగా అందుతూ నిత్యం “ఎనర్జీ లెవల్స్ బ్యాలెన్స్‌” అవుతాయి. రోజంతా యాక్టివ్‌ గా ఉంటూ ఎక్కువ సేపు అలసట లేకుండా కాంతివంతంగా శక్తివంతంగా కనిపిస్తూ పనిచేయ గలుగుతారు.

 milk and honey mixture కోసం చిత్ర ఫలితం

4. పాలు తేనే మిశ్రమం సేవించటం ద్వారా - కాల్షియం శరీరానికి బాగా అంది ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలకు పటుత్వం చేకూరుతుంది. డంత సమస్యలు, కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఎముకలు విరిగి ఉన్న వృద్ధులు, పిల్లలు పాలు, తేనె కలుపుకుని తాగితే దైహిక పటుత్వాన్ని పొందుతారు.

 milk and honey mixture కోసం చిత్ర ఫలితం

5. పాలు తేనే మిశ్రమం చక్కని ఔషధం గా పనిచేస్తుంది. ఫ్రతి  రోజూ రాత్రి నిద్రపోయేందుకు కనీసం 30 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని తాగితే నిద్ర చక్కగా ఒనగూరుతుంది శ్వాస ప్రక్రియ నియంత్రణ  తత్పలితంగా ఉషోదయం నుండే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటారు. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడే వారికి ఈ మిశ్ర మం దివ్య ఔషధం అని చెప్పొచ్చు.

milk and honey mixture కోసం చిత్ర ఫలితం

6. పాలు తేనే మిశ్రమం నిత్య సేవించటం ద్వారా  వృద్ధాప్యంలో వచ్చే చర్మం ముడతలను నివారించవచ్చు. అంటే సతత జీవిత యవ్వనం అన్నమాట. వృద్ధాప్యం దరి చేరదు. చర్మానికి సౌందర్యం చేకూరుతుంది.

enjoying morning calm కోసం చిత్ర ఫలితం

7. పాలు తేనే మిశ్రమం నిత్య సేవించటం ద్వారా సర్వ తాప నివారణ జరిగి (ఇన్‌ఫెక్షన్లు) శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిములు నశిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి ద్విగుణీకృత మౌతుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ సమస్యలు, వ్యాధులు అంత సులభంగా మన దరిచేరవు

మరింత సమాచారం తెలుసుకోండి: