సంబంధిత చిత్రం

మన భారత సమాజంలో గర్భం దాల్చలేక పోయిన మహిళలకు అడుగడుగునా ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదురవుతూవుంటాయి. ఇటువంటి సంఘటనలు మన దేశంలో, ప్రత్యేకించి గ్రామీణభారతంలో చాలా ఎక్కువ. స్త్రీ గర్భధారణ సమస్యకు దాదాపు స్రీలెంత కారణమో పురుషులూ అంతే కారణం.  స్త్రీ పురుషులుల్లో అనేక సందర్భాల్లో 50:50 పునరుత్పాదక శక్తి లోపించడం వల్లనే ఇలా జరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తన నివేదికలో స్పష్టం చేసింది. అందుకే ఇరువురు భాధ్యులైన చోట సమాజం మాత్రం శిక్ష స్త్రీలనెత్తిన వేస్తుంది.

sperm count in indian men కోసం చిత్ర ఫలితం

మన దేశంలో ప్రతి సంవత్సరమూ 1.20 కోట్ల నుంచి 1.80 కోట్ల మంది దంపతుల్లో సంతాన లేమి సమస్య తలెత్తటం సర్వసాధారణం. ఆఅ విషయాన్ని ఎయిమ్స్ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్యులు నిర్ధారించారు.  

సంబంధిత చిత్రం

మూడు దశాబ్దాల క్రితం మనదేశంలోని వయోజనులైన పురుషుల్లో మిల్లీ లీటర్‌కు 6 కోట్లుగా ఉన్న వీర్య కణాల సంఖ్య, ప్రస్తుతం 2 కోట్లకు క్షీణించిందని, కారణం మనమీకాలంలో చవిచూస్తున్న అనారోగ్యకరమైన జీవన విధానం, మానసిక వత్తిడితో కూడిన ఉద్యోగాలు, వాతావరణ కాలుష్యం, నిరంతర పౌష్ఠికాహార లోపం, మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లు. 

 sperm count in indian men కోసం చిత్ర ఫలితం

పొగాకు వినియోగం వల్ల వీర్య ఉత్పత్తి క్షీణిస్తుందని వారు తెలిపారు. భారత మహిళలు, ప్రత్యేకించి 29 నుంచి 35 సంవత్సరాల వయసున్న మహిళలు గర్భం దాల్చలేకపోవడానికి పురుషుల్లో వ్యాపిస్తున్న సంతానోత్పత్తి సామర్ధ్య లోపమే ప్రధాన కారణమంటున్నారు. ఫురుషుల్లో వీర్య కణాల సంఖ్య చాలా తగ్గిపోవటం, “వీర్య కణాల చలన శీలత” చాలా బలహీనంగా ఉండటం, లేదా ఫురుషుల్లో వీర్యకణ నిర్మాణం సరిగా లేకపోడం, ఇలా కొన్ని ఇతర లోపాల వల్లనే ఇలా జరుగుతున్నదని సంతాన సాఫల్య నిపుణులు డాక్టర్ జ్యోతి బాలీ వివరించారు.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: