*మనసుల్ని కలిపేది, 'మాట' 
*మనుషుల మధ్య విస్ఫోటాలు కలిగించేది 'మాట',
*అపార్ధాలు రగిలించేది, అనర్ధాలు సృష్టించేదీ 'మాటే' 
*ఓదార్పు నిచ్చేదీ,ఓరిమితో నిలిపేదీ 
'మాటే' 
*ప్రేమను పంచేదీ 'మాటే', 
*ప్రపంచాన్ని చూపేదీ 'మాటే',
*'మాట' 'మాట'కి ఉందెంతో తేడా! 
*పలికే మనిషిలో, పలికించే గొంతులో, పలుకుతున్న రీతిలో, అర్ధాలు, గూడార్ధాలు, అనేక అర్ధాలు, అనంత అర్ధాలు.
*తీసేయ్యలేం 'మాటేగా' అని, *పెట్టెయ్యలేం ప్రక్కన, ఏముందిలే 'మాటేగా' అని.
మాట 'నిలుపు కోటానికి' జరిగాయి యుద్ధాలెన్నో ప్రపంచ చరిత్రలో.
మాట 'ఇచ్చినందుకు' వచ్చాయి ప్రళయాలు గతంలో. 
మాటకున్న బలం మరి దేనికుంది లోకంలో?
తూటాకంటే ధృడమైనది! 
కత్తి కంటే పదునైనదీ!
తేనెకంటే తియ్యనైనదీ! 
వెన్నకంటే మృదువైనదీ "మాట".  
మాటలేనిదే...
మనషికి మనుగడ ఊహించలేం! మాటలేని లోకాన్ని ఊహించలేం!
మాటతోే శాసిస్తాం!
మాటతోనే శ్వాసిస్తాం!
కాలం గడిచేదీ, జీవితం నడిచేదీ జీవనం ముగిసేదీ, 'మాట'తోనే, మాటాడే 'తీరు' తోనే .
మాటకున్న పదును వాడికత్తికి లేదు.
మార్చగలదు మాట మనిషి మనసు.
కనుక నోరు జాగ్రత్త! జాగ్రత్త!.
శబ్దములకు గొప్ప శక్తి గలదు.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ,
జిహ్వాగ్రే మిత్ర బాన్ధవాః,
జిహ్వాగ్రే బంధన ప్రాప్తి:,
జిహ్వాగ్రే మరణం ధృవం!
మన నాలుక చివరనే లక్ష్మి యున్నది. అనగా మాటల వలననే సంపదలు లభించును.
మాటల చేతనే లోకమున బంధు మిత్రాదు లేర్పడు చున్నారు.
మాటలచేతనే బంధనము కలుగును. మాటల చేతనే మరణము కూడా కలుగును.
కాలుజారితే తీసుకోవచ్చు! 
కాని మాట జారితే తీసుకోలేము!
కొన్ని మాటలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే, కొన్ని మాటలు తూటాల్లాగా మనసును గాయపరుస్తాయి. 
మాటల తూటాల్ని పేల్చకండి!


మరింత సమాచారం తెలుసుకోండి: