వాట్సప్ కానీ.. ఫేస్ బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే చాలు.. పెళ్లి, పెళ్లాలు, మొగుడూ పెళ్లాల కొట్లాటల మీద ఎన్ని జోక్స్ కనిపిస్తాయో లెక్కేలేదు. ఇటీవలే వచ్చిన ఎఫ్ 2 సినిమా ఈ టాపిక్ ఆధారంగానే బంపర్ హిట్ కొట్టింది. మరి నిజంగా పెళ్లిలో అన్ని ఇబ్బందులుంటాయా..

indian marriage and sex కోసం చిత్ర ఫలితం


అంటే.. అదేం కాదంటున్నారు నిపుణులు. పెళ్లి మనిషికి చాలా విధాలుగా మేలు చేస్తుందట. అవేమిటో చూద్దాం.. జీవితంలో పెళ్లి చేసుకోని వారు 60 ఏళ్లకు మించి బతకడం లేదని అమెరికా డ్యూక్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌కి చెందిన డాక్టర్‌ ఐలెన్‌ సీగ్లర్‌ఆయన సహచరులు ఒక అధ్యయనం ద్వారా వెల్లడించారుముఖ్యంగా నడివయసులో అర్ధాంగి లేకపోతే మాత్రం అర్ధాయుష్షులు కాక తప్పడం లేదట.

సంబంధిత చిత్రం


60 ఏళ్ల లోపు వారిలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుందివారిలో ధైర్యం సన్నగిలే సమయం అదిఅటువంటి సమయంలో జీవిత భాగస్వామి పక్కనుంటేఆ ధైర్యానికిఆత్మవిశ్వాసానికి కొరత ఉండదుజీవితంలో అసలు పెళ్లే చేసుకోనివారిలో గుండె జబ్బులు,  రక్తపోటు,  మధుమేహం  వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశీలనలో తేలింది.

marriage health కోసం చిత్ర ఫలితం


దీర్ఘాయుర్దాయాన్ని అనుభవిస్తున్నవారిలో 99 శాతం మంది వివాహం చేసుకున్న వాళ్లేనటపెళ్లయినవారు గుండెపోటు రెండుసార్లు వచ్చినా తట్టుకోగలుగుతారటకానీ పెళ్లికానివారు ఒకసారి గుండెపోటుకు గురయినా బతకడం కష్టమేనట. దీన్ని బట్టి చూస్తే పెళ్లి వల్ల మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఆరోగ్యం గురించైనా పెళ్లి చేసుకోవాల్సిందేమేనట.


మరింత సమాచారం తెలుసుకోండి: