క్యాన్సర్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి. ఇది ఎందుకు వస్తుందో.. ఎవరికి వస్తుందో.. కారణాలేమిటో ఓ పట్టాన అర్థం కావు. నిత్యం వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వారిలో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తుంటాయి.

onion and vellulli కోసం చిత్ర ఫలితం


క్యాన్సర్ అంటే ఒకే జబ్బు కాదు.. క్యాన్సర్లలో పలు రకాలు.. శరీరంలోని దాదాపు ఏ భాగానికైనా వచ్చే జబ్బు ఇది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆరోగ్య సూత్రాలు పాఠించినా క్యాన్సర్ రాదన్న విశ్వాసం ఏదీ కనిపించడం లేదు. అందుకే ముందు జాగ్రత్తలు తప్పనిసరి.

onion and vellulli కోసం చిత్ర ఫలితం


ఐతే.. రోజూ తీసుకునే ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కు దూరంగా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండూ తీసుకోవడం ద్వారా కొలొరెక్టల్‌ కేన్సర్‌ వృద్ధి చెందే ప్రమాదం తక్కువగా ఉంటుందట. కొలొరెక్టల్‌ కేన్సర్‌ అనేది పెద్దపేగు లేదా పురీషనాళంలో జీర్ణాశయం కింద భాగంలో ఏర్పడుతుంది.

సంబంధిత చిత్రం


ఇతరులతో పోలిస్తే ఉల్లి జాతి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో ఇది వచ్చే ప్రమాదం 79 శాతం తక్కువని పరిశోధకులు వెల్లడించారు. అందుకే రోజూ తీసుకునే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి తీసుకునే ప్రయత్నం చేయడం ద్వారా కొంతవరకూ క్యాన్సర్ కు దూరంగా ఉండొచ్చన్నమాట. అందుకేనేమో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: