థైరాయిడ్‌ సమస్య ఈరోజుల్లో చాలా సాధారణం అయ్యింది. గతంలో ఎక్కువగా స్త్రీలలోనే ఈ లోపం కనిపించేది. ఇప్పుడు స్త్రీ,పురుషులు ఇద్దరిలోనూ ఈ థైరాయిడ్ సమస్య కనిపిస్తోంది. థైరాక్సిన్‌ హార్మోన్‌ హెచ్చుతగ్గులకు లోనవడమే థైరాయిడ్ సమస్య.

dhaniyalu in english కోసం చిత్ర ఫలితం


ఈ సమస్యకు ఇంట్లోనే చేసుకునే ఔషథం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్‌ గ్రంథిని సక్రమంగా పనిచేయించేందుకు ధనియాల కషాయం బాగా పనిచేస్తుందని సలహా ఇస్తున్నారు. మరి ఈ ధనియాల కషాయం ఎలా చేసుకోవాలి. ఓ సారి పరిశీలిద్దాం..

సంబంధిత చిత్రం


ధనియాలు - ఒక చెంచా... త్రికటు చూర్ణం (శొంఠి, మిరియాలు, పిప్పళ్లు) - అర చెంచా తీసుకోవాలి. ధనియాలు దంచి రాత్రివేళ చల్లని నీళ్లలో వేసి ఉదయాన్నే వడబోసుకొని తాగాలి. లేదంటే.. ధనియాలను దంచి రాత్రివేళ వేడినీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే వడబోసుకొని కూడా తాగొచ్చు.

సంబంధిత చిత్రం


అయితే నీళ్లలో ఇలాంటి కషాయం తాగడం చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అలా అయితే ఏదైనా శీతలపానీయంలో ధనియాల పొడి, త్రికటు చూర్ణం కలిపి తాగవచ్చు. మొత్తానికి ధనియాల కషాయానికి ధైరాయిడ్ సమస్యను తగ్గించే శక్తి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: