మారే కాలంతో పాటు మారాలి. కొత్త ఉపాధి అవకాశాల వైపు మరలాలి. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. అప్పుడే చక్కటి ఉపాధి అవకాశాలు మన సొంతమవుతాయి. ప్రస్తుతం దేశంలో కొన్ని రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాలీలు ఉన్నాయి. కానీ వాటికి అర్హులే కరువయ్యారు.

Related image


అనలిటిక్స్‌, డేటా సైన్స్‌ విభాగాల్లో ప్రస్తుతం నిపుణుల కొరత చాలా ఉందట. వీటికి అవసరమైన నైపుణ్యాలున్న వ్యక్తుల కొరత వల్ల దాదాపు 97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఓ సంస్థ సర్వే వెల్లడించింది. ఈ రంగాల్లో ఒక ఏడాది వ్యవధిలోనే 45 శాతం మేర ఉద్యోగాలు పెరిగాయట.

Image result for data analytics


ఈ రంగాలన్నీ ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్నందుల్ల ఎక్కువ అనుభవం అవసరం లేదు. అయిదేళ్లలోపు అనుభవం ఉన్న వ్యక్తుల కోసం కంపెనీలు చూస్తున్నాయి. ఫ్రెషర్ల కోసం కూడా 21 శాతం మేర ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయట. ఉద్యోగార్ధులు తమ నైపుణ్యాలకు సానపెడితే ఉద్యోగాలు వచ్చినట్లే.

Related image


మొత్తం అనలిటిక్స్‌ ఉద్యోగాల్లో 24 శాతం బెంగళూరులోనే ఉన్నాయి. ఈ రంగాల్లో కొద్దిగా అనుభవం సంపాదించ గలిగితే వేతనాలు లక్షల్లోనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ రంగాలవైపు నిరుద్యోగులు దృష్టి సారిస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: